వేగంగా విస్తరిస్తున్న మరో కొత్త వైరస్ హంటా..
హంటా వైరస్‌తో ఇప్పటికే ముగ్గురు మృతి..
అంతర్జాతీయంగా మరో కొత్త వైరస్ భయం పెరుగుతోంది. “హంటా వైరస్” పేరుతో వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు పలు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. అర్జెంటీనా నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఒక నౌకలో ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు బయటపడటం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది.
ఈ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ముగ్గురు మరణించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ నౌకను కేప్ వెర్డ్ సమీపంలో నిలిపివేశారు. మరిన్ని కేసులు బయటపడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, అదే నౌకలో ప్రయాణించిన కొంతమంది టూరిస్టులు ఇప్పటికే యూరప్ మరియు అమెరికా దేశాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇక ఇజ్రాయెల్‌తో పాటు యూరప్‌లోని కొన్ని దేశాల్లో కూడా హంటా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తర్వాత మరోసారి ప్రపంచాన్ని కొత్త వైరస్ భయం పట్టుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.