బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన 'బెన్నె దోశ'.. ఇంట్లోనే సింపుల్ గా.. ఆ కరకరలాడే రుచి రహస్యం మీకోసం! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన 'బెన్నె దోశ'.. ఇంట్లోనే సింపుల్ గా.. ఆ కరకరలాడే రుచి రహస్యం మీకోసం! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు!

Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్!

ఏపీలో నిరుద్యోగ యువతకు శుభవార్త. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీచర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పూర్తైంది.

Published : 2026-01-30 16:14:00

ఏపీలో ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జాబ్ క్యాలెండర్‌ను ఈసారి తప్పకుండా విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించే పనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. అన్ని శాఖల నుంచి ఖచ్చితమైన సమాచారం తెప్పించుకున్న తర్వాతే జాబ్ క్యాలెండర్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రతి ఏడాది ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి ముందస్తు ప్రణాళికతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా నియామకాల్లో ఆలస్యం తగ్గడమే కాకుండా నిరుద్యోగులకు ముందస్తు స్పష్టత కూడా లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విద్య, పోలీస్, రెవెన్యూ, వైద్య, మున్సిపల్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల నుంచి ఖాళీల జాబితాను ప్రభుత్వం సమీకరిస్తోంది. అయితే కొత్త ఉద్యోగాల భర్తీ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుందన్న అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఆర్థిక శాఖ అంచనాలు పూర్తయ్యాకే జాబ్ క్యాలెండర్‌కు తుది ఆమోదం లభించనుంది.

ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కీలక నియామకాలను పూర్తి చేసింది. ఇటీవల 16,347 టీచర్ పోస్టుల భర్తీతో పాటు సుమారు 6 వేల కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించింది. ఈ నియామకాలతో వేలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదే ఊపులో మిగిలిన శాఖల ఖాళీలను కూడా భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కొత్త జాబ్ క్యాలెండర్‌ను పకడ్బందీగా రూపొందించి, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నియామకాలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.

గతేడాది కూడా జాబ్ క్యాలెండర్ వస్తుందని నిరుద్యోగ యువత భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో అప్పట్లో నిరాశ నెలకొంది. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్‌పై అధికారిక ప్రకటన చేసి, నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి స్పష్టత వెలువడే అవకాశముండగా, జాబ్ క్యాలెండర్ ప్రకటనతో ఏపీలోని నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Spotlight

Read More →