TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.! Iphone Offers: యాపిల్ 50 ఏళ్ల పండుగ": ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్! Vivo V70 FE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాకప్.. వీవో కొత్త ఫోన్ అదిరిందిగా! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే! Samsung Galaxy Book 6: శామ్సంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు..! Best AC's: వేసవి వచ్చేసింది! 20,000 నుండి 40,000 బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Best Product: వంట గదికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్! 33 స్టైల్స్ తో... TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.! Iphone Offers: యాపిల్ 50 ఏళ్ల పండుగ": ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్! Vivo V70 FE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాకప్.. వీవో కొత్త ఫోన్ అదిరిందిగా! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే! Samsung Galaxy Book 6: శామ్సంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు..! Best AC's: వేసవి వచ్చేసింది! 20,000 నుండి 40,000 బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Best Product: వంట గదికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్! 33 స్టైల్స్ తో...

Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.!

Vivo V70 FE 5G: గత నెల రోజులుగా టెక్ ప్రియులను ఊరిస్తున్న వివో (Vivo), తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వి70 FE (Vivo V70 FE) ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు 200MP భారీ కెమెరా వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు మరియు లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి..

Published : 2026-04-07 11:00:00
  • "డీటెయిల్స్ అదిరిపోయాయి": 200MP అల్ట్రా స్టెబిలైజేషన్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అరంగేట్రం..
     
  • Gadgets: "ఛార్జింగ్ టెన్షన్ ఇక లేదు": స్లీక్ డిజైన్‌లోనూ 7000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్..

Vivo V70 FE 5G: గత నెల రోజులుగా టెక్ ప్రియులను ఊరిస్తున్న వివో (Vivo), తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వి70 FE (Vivo V70 FE) ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు 200MP భారీ కెమెరా వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు మరియు లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

ధర మరియు వేరియంట్లు..
స్మార్ట్‌ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన ధరలనే కంపెనీ ఖరారు చేసింది. వివో వి70 FE మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 కాగా, 8 జీబీ + 256 జీబీ మోడల్ ధర రూ. 40,999 గా ఉంది. ఇక హై-ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ + 128 జీబీ మోడల్‌ను రూ. 44,999 ధరకు వివో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ 'మాన్సూన్ బ్లూ' మరియు 'నాథర్న్స్ లైట్ పర్పల్' అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్లు మరియు సేల్ వివరాలు..
వివో వి70 FE కోసం ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ అధికారిక విక్రయాలు మొదలవుతాయి. లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే, Axis మరియు కోటక్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు 10% ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. అదనపు ప్రయోజనంగా ఒక సంవత్సరం వారంటీ మరియు iQOO TWS 1e ఇయర్ బడ్స్‌ను అతి తక్కువ ధరకే పొందే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.

డిస్‌ప్లే మరియు పర్ఫార్మెన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఇందులో మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 12 జీబీ వరకు ర్యామ్ మరియు 256 జీబీ అంతర్గత స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. కొత్త 'డార్క్ నెస్ గ్లో' టెక్నాలజీతో కూడిన స్లీక్ డిజైన్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

కెమెరా మరియు బ్యాటరీ సామర్థ్యం..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 200MP మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్‌ను అందించారు. ఇది అల్ట్రా స్టెబిలైజేషన్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI ఫీచర్లను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంత స్లీక్ డిజైన్‌లోనూ వివో 7000 mAh భారీ బ్యాటరీని పొందుపరచడం విశేషం. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Spotlight

Read More →