Earthquake: ఒంగోలులో భూప్రకంపనలు: ఆందోళనలో ప్రజలు! Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం ఉగ్రరూపం... ముగ్గురి మృతి! 4 కిలోమీటర్ల పరిధిలో.. Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్... మరో రెండు రోజుల పిడుగులతో కూడిన భారీ వర్షాలు! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Weather: దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. పలు ప్రాంతాలకు ఐఎమ్‌డీ అలర్ట్! Rain Alert: ఏపీకి వరుణుడి గండం: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. పిడుగుల హెచ్చరిక! Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్: వచ్చే ఐదు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన! Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా... ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి.. Earthquake: ఒంగోలులో భూప్రకంపనలు: ఆందోళనలో ప్రజలు! Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం ఉగ్రరూపం... ముగ్గురి మృతి! 4 కిలోమీటర్ల పరిధిలో.. Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్... మరో రెండు రోజుల పిడుగులతో కూడిన భారీ వర్షాలు! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Weather: దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. పలు ప్రాంతాలకు ఐఎమ్‌డీ అలర్ట్! Rain Alert: ఏపీకి వరుణుడి గండం: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. పిడుగుల హెచ్చరిక! Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్: వచ్చే ఐదు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన! Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా... ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి..

Weather: రాష్ట్రంలో మూడు రోజులు విభిన్న వాతావరణం.. ఎండలు, పిడుగులతో వర్షాలు!

Weather: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

Published : 2026-05-04 19:01:00

తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు..

తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం (మే 5) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వర్షాల సమయంలో రైతులు, కూలీలు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

ఇక మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగనుంది. ఉక్కపోత, వేడి కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నాయి. కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 43.9°C, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 43.1°C, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.9°C నమోదయ్యాయి. మార్కాపురం పెద్దదోర్నాల, నెల్లూరు గూడూరు, శ్రీకాకుళం తామాడలో 42.7°C, కడప జమ్మలమడుగులో 42.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలాగే ఏలూరు ధర్మాజీగూడెంలో 42.2°C, కర్నూలు మంత్రాలయంలో 42°C, అనంతపురం తెరన్నపల్లిలో 41.9°C, పల్నాడు అమరావతిలో 41.8°C నమోదయ్యాయి. చిత్తూరు తవణంపల్లెలో 41.6°C, గుంటూరులో 41.3°C, ప్రకాశం మర్రిపూడిలో కూడా 41.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 16 జిల్లాల పరిధిలోని 74 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్ర ప్రభావం కనిపించిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు ఉండే పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

Spotlight

Read More →