OTT Releases 2026: హీరో అంటే ఇతనే భయ్యా.. పక్కా కామెడీ, ఏడాదికి మూడు సినిమాలు ఖాయం..!! 103 Years Old: 103 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... ముగ్గురు భార్యలు, డజను మంది పిల్లలతో... Dhurandhar: నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం.. పార్ట్-2 ఎఫెక్ట్‌తో పెరిగిన వ్యూస్! OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్! OTT Releases 2026: హీరో అంటే ఇతనే భయ్యా.. పక్కా కామెడీ, ఏడాదికి మూడు సినిమాలు ఖాయం..!! 103 Years Old: 103 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... ముగ్గురు భార్యలు, డజను మంది పిల్లలతో... Dhurandhar: నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం.. పార్ట్-2 ఎఫెక్ట్‌తో పెరిగిన వ్యూస్! OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్!

NBK Lifetime Achievement Award: ఢిల్లీలో బాలయ్యకు అరుదైన గౌరవం: 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!

NBK Lifetime Achievement Award: నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ' (IFFD 2026)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న బాలయ్య ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

Published : 2026-03-26 11:40:00

NBK Lifetime Achievement Award: నందమూరి అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. టాలీవుడ్ సీనియర్ హీరో, 'నటసింహం' నందమూరి బాలకృష్ణకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని 'భారత్ మండపం'లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ఆయనకు 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్'  అవార్డును ప్రధానం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు.

సినీ పరిశ్రమలో బాలకృష్ణ అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ గుర్తింపు లభించింది. తన తండ్రి, దివంగత లెజెండరీ నటుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య, కేవలం నటుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ వేడుకలో బాలయ్యతో పాటు అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్‌ను కూడా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

బాలకృష్ణ కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా వేలాది మంది పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. సినీ గ్లామర్‌ను సామాజిక సేవకు జోడించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే, 60 ఏళ్లు దాటిన వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలయ్య. ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, సమాజానికి మంచి సందేశం ఇచ్చే కథలను ఎంచుకోవడంలో ఆయన చూపిస్తున్న చొరవను సినీ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఢిల్లీ వేదికగా బాలయ్యకు ఈ గౌరవం దక్కడంపై తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా "జై బాలయ్య" అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన బాలయ్యకు ఈ అవార్డు రావడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న బాలయ్య ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Spotlight

Read More →