Sunil actor: మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్... Adivi Sesh: పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్! Film Chamber: ఐ బొమ్మ, బప్పంపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Peddhi Movie: ఆ చివరి 50 నిమిషాలు గుండె బరువెక్కుతుంది.. 'పెద్ది' క్లైమాక్స్‌పై బుచ్చిబాబు సనా షాకింగ్ కామెంట్స్! Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం! Ram Charan: సౌండ్ ఆఫ్ "పెద్ది" రామ్ చరణ్ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు! iBomma: మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ - కొత్త ఓటీటీ కంటెంట్‌పై..! Sunil actor: మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్... Adivi Sesh: పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్! Film Chamber: ఐ బొమ్మ, బప్పంపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Peddhi Movie: ఆ చివరి 50 నిమిషాలు గుండె బరువెక్కుతుంది.. 'పెద్ది' క్లైమాక్స్‌పై బుచ్చిబాబు సనా షాకింగ్ కామెంట్స్! Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం! Ram Charan: సౌండ్ ఆఫ్ "పెద్ది" రామ్ చరణ్ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు! iBomma: మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ - కొత్త ఓటీటీ కంటెంట్‌పై..!

Sunil actor: మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్...

Sunil actor: టాలీవుడ్ నటుడు సునీల్ మరో పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో ఆంటోనీ వర్గీస్ హీరోగా, పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'కట్టలన్'లో సునీల్ 'మారి' అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా వెల్లడించింది.

Published : 2026-05-18 20:38:00
  • అంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు…
     
  • మలయాళ పాన్ ఇండియా చిత్రం 'కట్టలన్'లో సునీల్..

Sunil actor: టాలీవుడ్ నటుడు సునీల్ మరో పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో ఆంటోనీ వర్గీస్ హీరోగా, పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'కట్టలన్'లో సునీల్ 'మారి' అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సునీల్ క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించింది. 'వేటకు సిద్ధంగా ఉండండి' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇటీవల ఇదే చిత్రం నుంచి తమిళ నటి దుషారా విజయన్ 'లూసీ' అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో పాటు కబీర్ దుహాన్ సింగ్ 'ఎడ్డీ'గా, పార్థ్ తివారీ 'రాబీ'గా నటిస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప' చిత్రంలో 'మొగిలేసు' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తిరందాసు 'మారి 95' అనే పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రానికి తొలుత 'కాంతార 2' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ను సంగీత దర్శకుడిగా ప్రకటించినా, ఆ తర్వాత అనూహ్యంగా 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్‌ను తీసుకున్నారు. ఈ మార్పు సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 'కట్టలన్' షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాస్తవానికి మే 14న విడుదల చేయాలని భావించినా, కొన్ని కారణాలతో విడుదల తేదీని మే 28కి మార్చారు. గతంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ షూటింగ్ సమయంలో జరిగిన ఓ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసి, ప్రాణాలకు తెగించి పనిచేసే స్టంట్‌మెన్‌ల ధైర్యానికి నివాళులర్పించడం అందరి ప్రశంసలు అందుకుంది.

బ్లాక్‌బస్టర్ 'మార్కో' చిత్ర నిర్మాత షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాల్ జార్జ్, జాబీ వర్గీస్, జెరో జాకబ్ కలిసి ఈ చిత్రానికి కథ అందించారు. ఆంటోనీ వర్గీస్‌కు జోడీగా రాజిషా విజయన్ నటిస్తుండగా, రాపర్ బేబీ జీన్, జగదీష్, సిద్దిఖ్ వంటి ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెనాడైవ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారీ తారాగణం, ప్రముఖ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Spotlight

Read More →