Uber: అమరావతి క్వాంటమ్ విజన్‌పై ఉబర్ ఆసక్తి.. విశాఖలో కార్యకలాపాల విస్తరణకు సిద్ధం! Gold rate today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! మార్కెట్‌లో ఊహించని మార్పులు! Tax Payers: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: 2026-27 అసెస్‌మెంట్ ఏడాదికి ఐటీఆర్ ఫైలింగ్ షురూ! ED: జైగార్డ్ టెక్నాలజీస్ కేసులో ఈడీ దాడులు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు వేగం! India Economic: దేశవ్యాప్తంగా మొదలైన పాలు, చక్కెర, బంగారం ధరల షాక్.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు! Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Uber: అమరావతి క్వాంటమ్ విజన్‌పై ఉబర్ ఆసక్తి.. విశాఖలో కార్యకలాపాల విస్తరణకు సిద్ధం! Gold rate today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! మార్కెట్‌లో ఊహించని మార్పులు! Tax Payers: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: 2026-27 అసెస్‌మెంట్ ఏడాదికి ఐటీఆర్ ఫైలింగ్ షురూ! ED: జైగార్డ్ టెక్నాలజీస్ కేసులో ఈడీ దాడులు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు వేగం! India Economic: దేశవ్యాప్తంగా మొదలైన పాలు, చక్కెర, బంగారం ధరల షాక్.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు! Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు!

Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం!

Central Govt: దేశంలో చక్కెర నిల్వలు సమృద్ధిగా ఉండేలా చూసేందుకు, అలాగే సామాన్య ప్రజలపై ధరల భారం పడకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 2026-05-14 12:58:00

చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి..

న్యూఢిల్లీ: దేశంలో చక్కెర నిల్వలు సమృద్ధిగా ఉండేలా చూసేందుకు, అలాగే సామాన్య ప్రజలపై ధరల భారం పడకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులపై వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆంక్షలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్‌లో చక్కెర అందుబాటులో ఉండేలా చేయడం, ధరలు అదుపులో ఉంచడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులన్నింటిపైనా నిషేధం వర్తించనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెరకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కొన్ని ప్రత్యేక ఒప్పందాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో ఉన్న కోటా ఒప్పందాల ప్రకారం జరిగే చక్కెర ఎగుమతులపై ఈ ఆంక్షలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

గత కొంతకాలంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చక్కెర ధరలు అదుపులో ఉంటే సాధారణ కుటుంబాల ఖర్చులపై కూడా కొంత భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, ఎగుమతులపై ఆధారపడిన చక్కెర పరిశ్రమపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశమున్నప్పటికీ, దేశీయ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Spotlight

Read More →