RBI: రూ.2,000 నోటు చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక అప్డేట్! Gold Rate Today: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా? మే 1వ తేదీ నాటి లేటెస్ట్ రేట్ల వివరాలు ఇవే.! Jio Recharge: జియో షాకింగ్ రీఛార్జ్ ప్లాన్స్... రూ. 200 లోపే అదిరిపోయే ప్లాన్స్.. డేటా, కాల్స్ అన్నీ ఫ్రీ! Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Digital Payments: 8 దేశాల్లో యూపీఐ సేవలు.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముద్ర! యూపీఐ నుంచి ఐఎంపీఎస్ వరకు.. అన్నీ రికార్డులే.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... RBI: రూ.2,000 నోటు చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక అప్డేట్! Gold Rate Today: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా? మే 1వ తేదీ నాటి లేటెస్ట్ రేట్ల వివరాలు ఇవే.! Jio Recharge: జియో షాకింగ్ రీఛార్జ్ ప్లాన్స్... రూ. 200 లోపే అదిరిపోయే ప్లాన్స్.. డేటా, కాల్స్ అన్నీ ఫ్రీ! Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Digital Payments: 8 దేశాల్లో యూపీఐ సేవలు.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముద్ర! యూపీఐ నుంచి ఐఎంపీఎస్ వరకు.. అన్నీ రికార్డులే.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ...

APNRT: విదేశాంధ్రులకు APNRT గ్లోబల్ వ్యాపార మార్గం.. TIPEX.club తో కొత్త అవకాశాలు!

APNRT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీఎన్‌ఆర్టీఎస్ (APNRTS) మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంస్థ ప్రెసిడెంట్ గా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన డా. రవి వేమూరు ఆధ్వర్యంలో “TIPEX.club” అనే ప్రత్యేక వేదికను రూపొందించారు.

Published : 2026-05-02 09:34:00

గ్లోబల్ ట్రేడింగ్ వైపు తెలుగు వారికి మార్గదర్శకం..

ఎవరికైనా అవకాశం… ముఖ్యంగా మహిళలకు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీఎన్‌ఆర్టీఎస్ (APNRTS) మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంస్థ ప్రెసిడెంట్ గా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన డా. రవి వేమూరు ఆధ్వర్యంలో “TIPEX.club” అనే ప్రత్యేక వేదికను రూపొందించారు. ఈ వేదిక ద్వారా తెలుగువారిని అంతర్జాతీయ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల సమయంలో ఎన్నారైలకు “ఉద్యోగం మాత్రమే కాకుండా వ్యాపారం వైపు అడుగులు వేయాలి, ఇతరులకు ఉపాధి కల్పించాలి” అని ఇచ్చిన పిలుపు ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది. అదే దిశగా రవి వేమూరు ఈ క్లబ్‌ను అభివృద్ధి చేశారు.

సాధారణంగా గుజరాతీలు, తమిళులు వ్యాపారంలో ముందుండే వారిగా గుర్తింపు పొందారు. వారికి బలమైన అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉంది. ఇదే తరహాలో తెలుగువారు కూడా ప్రపంచ మార్కెట్లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా TIPEX.club పని చేస్తోంది.

ప్రస్తుత గ్లోబలైజేషన్ కాలంలో ఎక్కడ నుంచైనా వ్యాపారం చేయడం సాధ్యమే. మన ఇంట్లో నుంచే తయారు చేసే వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, గుంటూరు మిర్చి వంటి ఉత్పత్తులు విదేశాలకు వెళ్లి మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులతో అదే అవకాశాన్ని విస్తరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.

TIPEX.club ప్రత్యేకత ఏమిటంటే ఇది పెద్ద పెట్టుబడులు లేకుండా కూడా ప్రారంభించవచ్చు. పార్ట్ టైమ్‌గా కూడా నిర్వహించవచ్చు. ఉద్యోగులు, యువకులు మాత్రమే కాదు, ఇంట్లో ఉండే గృహిణులు కూడా ట్రేడింగ్ ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

ఈ వేదికలో చేరిన వారికి పూర్తి స్థాయి మార్గదర్శకత్వం అందించబడుతుంది. ఇందులో భాగంగా: 
గైడెడ్ ట్రేడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలు దారులు, సరఫరాదారులతో నెట్‌వర్క్
లైవ్ ట్రేడ్ అవకాశాలు
లాజిస్టిక్స్, డాక్యుమెంటేషన్, అనుమతులపై సహాయం
వ్యాపారంపై పూర్తి మద్దతు

అంతర్జాతీయ వాణిజ్యం మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది: 
సేకరణ (Procurement)
రవాణా (Transport)
పంపిణీ (Distribution)
ఈ మొత్తం ప్రక్రియను సులభంగా అర్థమయ్యేలా శిక్షణ ఇస్తారు.

TIPEX.club లో చేరాలంటే:
ఆన్‌లైన్‌లో అకౌంట్ క్రియేట్ చేసి నమోదు చేసుకోవాలి
ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి
శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలి
వర్క్‌షాప్స్ ద్వారా ట్రేడింగ్ నేర్చుకోవాలి

తెలుగు వారిని గ్లోబల్ కమ్యూనిటీ లీడర్లుగా తీర్చిదిద్దడం, ఉద్యోగాల నుండి వ్యాపారాల వైపు మార్చడం ప్రభుత్వ లక్ష్యం. TIPEX.club ఈ దిశగా ఒక కీలక అడుగు. సరైన మార్గదర్శకత్వంతో అంతర్జాతీయ ట్రేడింగ్ ద్వారా స్థిరమైన ఆదాయం సంపాదించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌తో ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, TIPEX.club ద్వారా శిక్షణ పొందుతూ గ్లోబల్ ట్రేడర్లుగా ఎదగాలని ఏపీఎన్‌ఆర్టీఎస్ ఆహ్వానిస్తోంది.

Spotlight

Read More →