TAGDV: డెలావేర్‌లో ఉగాది సాంస్కృతిక పోటీలు.. TAGDV ఆధ్వర్యంలో..

Telugu Association of Greater Delaware Valley (TAGDV): డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) ఆధ్వర్యంలో నిర్వహించిన “శ్రీ పరాభవ నామ ఉగాది సాంస్కృతిక పోటీలు–2026” ఘనవిజయాన్ని సాధించాయి. శనివారం భారతీయ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

Published : 2026-04-20 12:51:00

200కు పైగా వివిధ విభాగాల్లో పాల్గొన్న పోటీదారులు..

600 మందికి పైగా హాజరైన ప్రేక్షకులు..

డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) ఆధ్వర్యంలో నిర్వహించిన “శ్రీ పరాభవ నామ ఉగాది సాంస్కృతిక పోటీలు–2026” ఘనవిజయాన్ని సాధించాయి. శనివారం భారతీయ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. 200కు పైగా పోటీదారులు వివిధ విభాగాల్లో పాల్గొనగా, 600 మందికి పైగా ప్రేక్షకులు హాజరై ఉత్సాహంగా వీక్షించారు. చిన్నారుల నుంచి యువత వరకు పాటలు, నృత్యాలు, తెలుగు ప్రసంగ పోటీల్లో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమం మొత్తం తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సుగంధంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా సంఘ కార్యవర్గం మాట్లాడుతూ, “పోటీలకు లభించిన స్పందన ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు చూపిన ప్రతిభ మాకు ప్రేరణనిచ్చింది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సంస్కృతిని అందించడం మా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.

పోటీలకు న్యాయనిర్ణేతలుగా శ్రీ స్రీనివాస్ చాగంటి, డా. అన్నపూర్ణ చాగంటి, డా. మధు దౌలపల్లి, గురు శ్రీమతి మహాలక్ష్మి నారాయణ, శ్రీమతి శివరంజని బతుల, శ్రీ హరికృష్ణ మహర్షి, గురు శ్రీమతి కృష్ణ ప్రియ వోగేటి, గురు శ్రీమతి సంగీత బాలచందర్, గురు శ్రీమతి శ్రావణి నాగబండి, గురు శ్రీమతి భారతి అశోక్, శ్రీమతి రవీనా తుమ్మల, శ్రీమతి సౌమ్య మడకసిర గార్లు పాల్గొని తమ విలువైన సూచనలు అందించారు.

యూత్ కమిటీ సభ్యులు — యుక్త బుంగటావుల, ఆదిత్య అనంతుని, అద్వైత్ బొందుగుల, తనిష్క కర్రోతు, స్థుతి రాకోతు, పార్ధ కర్రోతు, క్రీషిత నందమూరి, శ్రీ విద్యా రెడ్డి కర్ర, ఆర్యన్ పసుపుల — కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ రోజంతా ఎంసీలుగా వ్యవహరించారు. వీరికి శ్రీమతి కవిత కురుకుండా, శ్రీ కృష్ణ నందమూరి మార్గదర్శకత్వం అందించారు.

ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ సేవలు అందించిన శ్రీ విశ్వనాథ్ కొగంటి గారికి, ధ్వని–దృశ్య (AV) సేవలు అందించిన శ్రీ రమణ రాకోతు గారికి సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలంకరణల సమన్వయానికి ఆదీ గుప్తా సహకారం అందించగా, వేదికను అందించిన భారతీయ టెంపుల్ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను https://tagdv.events/pics లింక్‌లో వీక్షించవచ్చు.

ఈ విజయానికి సంఘ అధ్యక్షుడు తులసి రామమోహన్ రావు తల్లూరి, ఉపాధ్యక్షుడు హరీష్ అన్నబత్తిన, కార్యదర్శి సురేష్ బొందుగుల, ఖజాంచీ మధు బుడాటి, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చుండూరి, జాయింట్ ఖజాంచీ శివ అనంతుని, సభ్యులు కవిత కురుకుండా, సునీత సిద్ధపురెడ్డి, కృష్ణ నందమూరి, విక్రమ్ అర్జుల, సురేష్ యలమర్తి, లవ కుమార్ ఐనంపూడి, భాస్కర్ మక్కెన, గౌరి కర్రోతు తదితరుల కృషి కీలకంగా నిలిచింది.

ఇక మే 2న డౌనింగ్ టౌన్ హై స్కూల్ ఈస్ట్ (50 Devon Dr, Exton, PA) లో జరగనున్న ఉగాది ఉత్సవాలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.

Spotlight

Read More →