- Associations: నిబంధనల మధ్యే పసుపు పండుగ: 50 మంది సభ్యులతో పరిమితంగా జరిగిన టీడీపీ వేడుకలు..
- "కువైట్ గడ్డపై మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ సంబరాలు": యుద్ధ వాతావరణంలోనూ తగ్గని కార్యకర్తల ఉత్సాహం..
NRI TDP program: కువైట్‌లో మాలేపాటి సురేష్ బాబు నాయుడు గారి అద్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని హవల్లీ ఏరియాలోని కృష్ణాస్ రెస్టారెంట్‌లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాము. ప్రస్తుతం కువైట్‌లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పెద్ద ఎత్తున గుమికూడకుండా సుమారు 50 మంది సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను పంచుకున్నారు. కువైట్‌లో ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీకి అనేక మంది అభిమానులు, కార్యకర్తలు ఉండడం, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతుండడం గర్వకారణం. అలాగే ఒకే చోట అందరూ కలవడం సాధ్యం కాకపోవడంతో, సభ్యులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో చిన్న చిన్న వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదే సందర్భంగా, నిన్న ఎన్ఆర్ఐ టిడిపి తరపున జూమ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డా. వేమూరి రవి గారు, బుచ్చి రాంప్రసాద్ గారు, హక్కిలి నాగేంద్రబాబు గారు, రావి రాధాకృష్ణ గారు, చప్పిడి రాశేఖర్ గారు పాల్గొని మాతో మమేకమై మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. రాబోయే మహానాడు కార్యక్రమాన్ని యుద్ధ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కువైట్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు, అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.