దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, జీఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశంలోని వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా కోచింగ్ లేకుండా ఇంట్లోనే సిద్ధమవుతున్న అభ్యర్థులకు సరైన ప్రణాళిక, సరైన వనరులు అత్యవసరం. అలాంటి విద్యార్థుల కోసం టెక్నాలజీ ఆధారిత కొన్ని ఉచిత యాప్‌లు పరీక్షా ప్రిపరేషన్లో కీలక పాత్ర పోషించగలవు.
జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూపొందించిన అధికారిక యాప్ ఇది. ఈ యాప్‌లో ప్రతిరోజూ ఉచిత మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. ప్రతి పరీక్ష తర్వాత వివరణాత్మక సమాధానాలు, సొల్యూషన్లు, పెర్ఫార్మెన్స్ అనాలసిస్ కూడా చూడవచ్చు. దీని ద్వారా విద్యార్థులు తమ బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరచుకోవచ్చు. ఆఫ్‌లైన్ యాక్సెస్ సౌకర్యం ఉండటం మరో ప్రధాన ఆకర్షణ. నేరుగా అధికారిక ప్యాటర్న్‌లో ప్రాక్టీస్ చేయడం వల్ల నిజమైన పరీక్షకు తగిన నైపుణ్యం పెంపొందుతుంది.
ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. విద్యార్థి ఏ అంశంలో వీక్‌గా ఉన్నాడో గుర్తించి, ఆ అంశంపై ప్రత్యేక ప్రాక్టీస్ మెటీరియల్, టెస్టులు అందిస్తుంది. గత 45 ఏళ్ల ప్రశ్నపత్రాలు, ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్‌లు ఇందులో లభిస్తాయి. విద్యార్థుల బలహీనతల ఆధారంగా వ్యక్తిగత లెర్నింగ్ ప్లాన్ రూపొందించే మెల్‌వానో యాప్ వాస్తవానికి ఒక స్మార్ట్ కోచింగ్ మాదిరిగానే ఉపయోగపడుతుంది. ఇది సొంత ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్థులకు మరింత సహాయకారి అవుతుంది.
ఇది కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన ఒక గొప్ప ఇ–లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. ఇందులో దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీలు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు రూపొందించిన వీడియో లెక్చర్లు, నోట్లు, అసైన్మెంట్లు అందుబాటులో ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవల్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఇంట్లో నుంచే నాణ్యమైన బోధన అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
జేఈఈ మెయిన్ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమబద్ధమైన టైమ్‌టేబుల్, కాంప్రహెన్సివ్ ప్రాక్టీస్, మరియు సరైన రివిజన్ పద్ధతులు చాలా ముఖ్యం. ఈ యాప్‌ల సాయంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను సులభతరం చేసుకోవడంతో పాటు సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సాంకేతికతను సరిగ్గా వినియోగిస్తే మొదటి ప్రయత్నంలోనే జేఈఈ మెయిన్ క్రాక్ చేయడం అసాధ్యమేమీ కాదు.