రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో పెద్ద ఆఫర్ ప్రకటించింది. గూగుల్‌తో భాగస్వామ్యంగా జియో 18 నెలల పాటు Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. మొదట్లో 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపినా ఇప్పుడు అన్ని వయసు వర్గాల జియో యూజర్లకుఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
సాధారణంగా గూగుల్ AI ప్రో ప్లాన్ నెలకు ₹1,950 ఖర్చు అవుతుంది. కానీ జియో యూజర్లు 18 నెలల పాటు ఉచితంగా ఈ ప్రీమియం సర్వీస్‌ను పొందొచ్చు. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, Veo 3.1 Fast వంటి అత్యాధునిక AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ఎలా పొందాలి ఈ ఉచిత ఆఫర్?
ఈ సబ్స్క్రిప్షన్ పొందేందుకు యూజర్‌కి యాక్టివ్ జియో సిమ్ ఉండాలి మరియు అన్లిమిటెడ్ 5G ప్లాన్ ఉండటం తప్పనిసరి. తర్వాత ఈ సులభమైన దశలను అనుసరించాలి:
1. ముందుగా మీ మొబైల్లో MyJio యాప్ ఓపెన్ చేయండి.
2. హోమ్ పేజీలో పైభాగంలో కనిపించే Early Access బ్యానర్‌పై క్లిక్ చేయండి.
3. అక్కడ Claim Now బటన్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి.
4. వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది, చివరలో ఉన్న Agree ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీరు Gemini App ఓపెన్ చేసి మీ Pro స్టేటస్ ధృవీకరించుకోండి.
Google AI Pro ఫీచర్లు
గూగుల్ AI ప్రో ప్లాన్‌లో సాధారణ ఫ్రీ టియర్ కంటే అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.
Gemini 2.5 Pro మోడల్ యాక్సెస్
Deep Research మరియు Nano Banana ద్వారా ఇమేజ్ జనరేషన్
Veo 3.1 Fast తో టెక్స్ట్ ద్వారా వీడియోలు సృష్టించే సౌకర్యం
Gemini Code Assist మరియు CLI టూల్స్ కోసం అధిక రేట్ లిమిట్స్
2TB క్లౌడ్ స్టోరేజ్ (Drive, Gmail, Photos లలో)
అదనంగా, Gmail, Docs, Sheets వంటి Google Workspace యాప్స్‌లో కూడా AI సహాయం అందుతుంది.
ఎందుకు ప్రత్యేకం ఈ ఆఫర్?
జియో గూగుల్ భాగస్వామ్యం భారతదేశంలో డిజిటల్ అనుభవాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. AI ఆధారిత సాంకేతికతను సాధారణ వినియోగదారులందరికీ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
ఇప్పుడు 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారైనా, అందరూ ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా భారతీయ యూజర్లు గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రీమియం AI టూల్స్‌ను అనుభవించే అవకాశం పొందుతున్నారు.