Anil Ravipudi: చిరంజీవి సినిమా హిట్ ఎఫెక్ట్.. శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి! పిల్లల లంచ్ బాక్స్‌లోకి హెల్తీ ఆప్షన్... రుచికరమైన జొన్న మసాలా పరాటా! Vijay–Rashmika: విజయ్–రష్మిక పెళ్లి నిజమేనా..? ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియోలు వైరల్..! రామ్ చరణ్–ఉపాసనలకు కవల పిల్లలు! మెగా కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్! చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! AP POLITICS: వైసీపీ కి షాక్.. అంబటి అరెస్ట్…! గుంటూరులో హైటెన్షన్..! 3 ట్రిలియన్ డాలర్ల అరబ్ మార్కెట్ పై భారత్ గురి! Gas Cylinder: బడ్జెట్ ముందు వ్యాపారులకు షాక్..! కమర్షియల్ ఎల్‌పీజీ ధరల పెంపు! రాత్రి నిద్ర పట్టడం లేదా... ఈ చిట్కా మీ కోసమే! AP Ration Card Updates: రేషన్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా? Anil Ravipudi: చిరంజీవి సినిమా హిట్ ఎఫెక్ట్.. శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి! పిల్లల లంచ్ బాక్స్‌లోకి హెల్తీ ఆప్షన్... రుచికరమైన జొన్న మసాలా పరాటా! Vijay–Rashmika: విజయ్–రష్మిక పెళ్లి నిజమేనా..? ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియోలు వైరల్..! రామ్ చరణ్–ఉపాసనలకు కవల పిల్లలు! మెగా కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్! చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! AP POLITICS: వైసీపీ కి షాక్.. అంబటి అరెస్ట్…! గుంటూరులో హైటెన్షన్..! 3 ట్రిలియన్ డాలర్ల అరబ్ మార్కెట్ పై భారత్ గురి! Gas Cylinder: బడ్జెట్ ముందు వ్యాపారులకు షాక్..! కమర్షియల్ ఎల్‌పీజీ ధరల పెంపు! రాత్రి నిద్ర పట్టడం లేదా... ఈ చిట్కా మీ కోసమే! AP Ration Card Updates: రేషన్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా?

AP Ration Card Updates: రేషన్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా?

ఏపీ రేషన్ కార్డుదారులకు అదిరిపోయే వార్త! నేటి నుంచి రేషన్ షాపుల్లో మరో కొత్త నిత్యావసర సరుకు పంపిణీ షురూ. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే ప్రభుత్వం అందిస్తున్న ఆ వస్తువు ఏమిటంటే..

Published : 2026-02-01 08:19:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన సామాన్య ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, నిత్యావసర సరుకుల జాబితాలోకి తాజాగా 'గోధుమ పిండి'ని చేర్చింది. నేటి (ఫిబ్రవరి 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం  మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర దాదాపు రూ. 60 నుండి రూ. 65 వరకు పలుకుతోంది. అయితే, పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కేవలం రూ. 20లకే కిలో గోధుమ పిండి ప్యాకెట్‌ను అందించాలని నిర్ణయించింది. అంటే మార్కెట్ ధర కంటే దాదాపు రూ. 40 తక్కువకే నాణ్యమైన పిండి లబ్ధిదారులకు అందనుంది. ప్రతి నెలా ఒక్కో కార్డుదారుడికి ఒక కిలో చొప్పున ఈ పంపిణీ చేపడతారు.

పౌరసరఫరాల శాఖ ప్రణాళిక ప్రకారం, తొలి విడతలో భాగంగా ఆదివారం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో పంపిణీ మొదలవుతుంది. తదుపరి దశలో ఈ సౌకర్యాన్ని డివిజన్ కేంద్రాలకు, ఆపై మండల స్థాయిలోని మారుమూల గ్రామాల రేషన్ దుకాణాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే అవసరమైన స్టాక్‌ను ప్యాకెట్ల రూపంలో గోదాముల నుండి డీలర్ల వద్దకు చేరవేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం కేవలం సరుకుల పంపిణీకే పరిమితం కాకుండా, రేషన్ దుకాణాలను 'మిినీ మాల్స్'గా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పనివేళల్లో మార్పులు చేసి, ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించాలని చూస్తోంది. పాత ప్రతిపాదన అయితే ‌నెలకు కేవలం 1 నుండి 15వ తేదీ వరకు, ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు మాత్రమే. కొత్త ప్రతిపాదన ఉదయం నుండి రాత్రి వరకు సుమారు 12 గంటల పాటు దుకాణాలు తెరిచి ఉంచడం ద్వారా లబ్ధిదారులు తమకు నచ్చిన సమయంలో సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.

గత ఏడాది డిసెంబర్ నుంచే బియ్యంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు గోధుమ పిండిని కూడా జత చేయడంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పోషకాహారాన్ని సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలతో పాటు తక్కువ ధరకే గోధుమ పిండిని కూడా పొందే వీలుంటుంది.

Spotlight

Read More →