రిలయన్స్ జియో ఎప్పటిలాగే మరోసారి తక్కువ ధరలో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. ఈ ప్లాన్లు ముఖ్యంగా జియో ఫోన్ వినియోగదారుల కోసం రూపొందించబడ్డాయి. రూ.150 లోపు ధరలోనే అన్లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లను అందించేలా ఈ ఆఫర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, తక్కువ ఆదాయం కలిగినవారికి డిజిటల్ కనెక్టివిటీ అందించడమే జియో లక్ష్యం.
మొదటగా రూ.91 ప్లాన్ గురించి చెప్పుకుంటే – రోజుకు 100MB డేటా, అదనంగా 200MB బోనస్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 50 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వస్తుంది. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్, జియో ఏఐ వంటి సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తక్కువ డేటా ఉపయోగించే వారికి ఇది చాలా సరైన ప్లాన్.
తర్వాత రూ.123 ప్లాన్ – ఈ ప్లాన్లో రోజుకు 0.5GB హై స్పీడ్ డేటా, 300 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. దీన్నీ 28 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. అదనంగా జియో టీవీ, జియో సావన్ వంటి యాప్లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ డేటా మరియు ఎంటర్టైన్మెంట్ రెండింటినీ సమతుల్యంగా అందిస్తుంది.
ఇక రూ.152 ప్లాన్ కూడా జియో ఫోన్ వినియోగదారులకే ప్రత్యేకం. ఇందులో కూడా రోజుకు 0.5GB డేటా, 300 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇది 28 రోజుల పాటు చెల్లుతుంది. తక్కువ ధరలో మంచి సర్వీస్ కావాలనుకునే వారికి ఇది సరైన ఆఫర్.
ప్రస్తుతం రూ.150 లోపు ఈ ప్లాన్లు జియో ఫోన్ వినియోగదారులకే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం కంపెనీ చౌకైన ప్లాన్ రూ.189 నుంచి మొదలవుతుంది. మొత్తంగా చూస్తే, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్లతో జియో దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచుతోంది.