US Navy Jets: గగనతలంలో ఘోర ప్రమాదం... గాల్లో ముక్కలైన రెండు యుద్ధ విమానాలు!! Donald Trump: ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ... ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు! Customs Rules: అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక... అవి లేకపోతే ఎయిర్‌పోర్టు నుండే వాపస్! TAGDV: డెలావేర్ వ్యాలీలో ఘనంగా సాగిన టిఎజిడివి ఉగాది వేడుకలు.. వెయ్యిమందికి పైగా తెలుగు వారి సందడి! NATS: న్యూజెర్సీలో ఘనంగా జరగనున్న ‘నాట్స్ కల్చరల్ ఫెస్టివల్’! MATA: మే 31న ‘మాటా’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మెడికల్ విద్యా కార్యక్రమం! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! USA: అమెరికాలో విషాదకర వాతావరణం.. టాంపాలో తెలుగు టెక్కీ మృతి! US Navy Jets: గగనతలంలో ఘోర ప్రమాదం... గాల్లో ముక్కలైన రెండు యుద్ధ విమానాలు!! Donald Trump: ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ... ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు! Customs Rules: అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక... అవి లేకపోతే ఎయిర్‌పోర్టు నుండే వాపస్! TAGDV: డెలావేర్ వ్యాలీలో ఘనంగా సాగిన టిఎజిడివి ఉగాది వేడుకలు.. వెయ్యిమందికి పైగా తెలుగు వారి సందడి! NATS: న్యూజెర్సీలో ఘనంగా జరగనున్న ‘నాట్స్ కల్చరల్ ఫెస్టివల్’! MATA: మే 31న ‘మాటా’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మెడికల్ విద్యా కార్యక్రమం! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! USA: అమెరికాలో విషాదకర వాతావరణం.. టాంపాలో తెలుగు టెక్కీ మృతి!

TASA: ప్రవాస భారతీయులకు టాసా ప్రత్యేక సదస్సు.. ఇమ్మిగ్రేషన్, వీసా అంశాలపై అవగాహన!

Telugu Association of San Antonio TASA: ప్రవాస భారతీయులకు ఉపయోగపడేలా TASA (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “ఇమ్మిగ్రేషన్ & వీసా అవగాహన సదస్సు” నిర్వహించనున్నారు.

Published : 2026-05-03 09:53:00

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఉమా మంత్రవాడి..

శాన్ ఆంటోనియో, టెక్సాస్: ప్రవాస భారతీయులకు ఉపయోగపడేలా TASA (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “ఇమ్మిగ్రేషన్ & వీసా అవగాహన సదస్సు” నిర్వహించనున్నారు. ప్రస్తుత వీసా నిబంధనలు, తాజా పాలసీ మార్పులపై స్పష్టమైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ సదస్సులో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఉమా మంత్రవాడి పాల్గొని కీలక విషయాలను వివరించనున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఉపయోగపడే అంశాలపై ఆమె సమగ్ర సమాచారం అందించనున్నారు.

ఈ కార్యక్రమం మే 3, 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాన్ ఆంటోనియోలోని Lunna Event Center లో జరుగుతుంది.

సదస్సులో H1-B వీసా ఫైలింగ్స్, H4 నుండి F1 వీసాకు మార్పులు, STEM OPT & CPT అవకాశాలు, అలాగే EB2, EB5 వంటి ఇమ్మిగ్రేషన్ కేటగిరీలపై తాజా అప్‌డేట్స్ చర్చించనున్నారు. అదనంగా, ఇటీవల జరిగిన పాలసీ మార్పులపై కూడా స్పష్టమైన వివరణ ఇవ్వబడుతుంది.

ఈ సదస్సుకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం చివర్లో పాల్గొనేవారికి తమ సందేహాలను నేరుగా అడిగి నివృత్తి చేసుకునేలా ఇంటరాక్టివ్ Q&A సెషన్ ఏర్పాటు చేశారు.

ఆసక్తి గల వారు ముందుగానే తమ ప్రశ్నలను ఆన్‌లైన్ ద్వారా పంపించవచ్చని టాసా ప్రతినిధులు సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆది నారాయణ, నీరజ సుంకర లేదా నూతన్ ఎల్లంకిలలను సంప్రదించవలసిందిగా టాసా కార్యవర్గం కోరింది. ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న వీసా సమస్యలకు స్పష్టమైన మార్గదర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించబడుతుండటం విశేషం.

Spotlight

Read More →