Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Traffic Alert: ప్రయాణికులకు అలెర్ట్... రేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు! ట్రయల్ రన్... Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Traffic Alert: ప్రయాణికులకు అలెర్ట్... రేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు! ట్రయల్ రన్...

New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్!

New Toll Rules India: ఏప్రిల్ 10, 2026 నుండి భారతదేశంలోని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేయబడతాయి. ఇకపై వాహనదారులు ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాలి. యూపీఐ ద్వారా చెల్లిస్తే 1.25 రెట్లు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త టోల్ నిబంధనల పూర్తి వివరాలు..

Published : 2026-04-06 15:15:00

New Toll Rules India: భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన షాక్ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద ఇప్పటివరకు ఉన్న నగదు చెల్లింపుల విధానానికి స్వస్తి పలుకుతూ, ఏప్రిల్ 10వ తేదీ నుండి సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకురాబోతోంది. ఇకపై టోల్ గేట్ల వద్ద చిల్లర కష్టాలు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, నిబంధనలు పాటించని వారికి మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే బుధవారం  నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ బూత్‌ల వద్ద క్యాష్ కౌంటర్లను పూర్తిగా మూసివేయనున్నారు. దీని అర్థం ఏమిటంటే, మీరు టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా మీ వాహనానికి ఫాస్టాగ్  ఉండాలి, లేదంటే ఫోన్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే టోల్ వసూలు చేయాలని రహదారి రవాణా శాఖ గట్టిగా నిర్ణయించుకుంది. టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి వేచి ఉండకుండా, ట్రాఫిక్ సాఫీగా సాగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అయితే, ఫాస్టాగ్ లేని వారు యూపీఐ ద్వారా డబ్బులు కడతామంటే ప్రభుత్వం ఒక చిన్న మెలిక పెట్టింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వాహనదారుల నుండి సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు అదనపు రుసుమును వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ ఉంటే 100 రూపాయలు కట్టాల్సి వస్తే, యూపీఐ ద్వారా కట్టేవారు 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులను పూర్తిగా నిరుత్సాహపరచడమే ఈ అదనపు బాదుడు వెనుక ఉన్న అసలు కారణం. ఒకవేళ ఎవరైనా డబ్బులు కట్టడానికి నిరాకరిస్తే, వారిని హైవే మీదకు అనుమతించబోమని, అవసరమైతే ఆన్‌లైన్ ద్వారా జరిమానా నోటీసులు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఒక వార్షిక పాస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. 3,075 రూపాయలు చెల్లించి ఒక సంవత్సరానికి సరిపడా ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే, ఏడాది పొడవునా సుమారు 200 టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఇది తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే అంశం. అలాగే, ఇకపై టోల్ గేట్ల దగ్గర ఐడీ కార్డులు చూపించి మినహాయింపు పొందే పాత పద్ధతిని కూడా రద్దు చేయనున్నారు. మినహాయింపు పొందే అర్హత ఉన్న వారందరికీ ప్రత్యేకమైన ఫాస్టాగ్‌లను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.

భవిష్యత్తులో టోల్ బూత్‌లు అనేవే లేకుండా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  మరో అడుగు ముందుకు వేస్తోంది. 'మల్టీ-లేన్ ఫ్రీ-ఫ్లో' టోలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పద్ధతిలో హైవేపై వెళ్తున్న వాహనాలను కెమెరాలు, సెన్సార్లు ఆటోమేటిక్‌గా గుర్తించి, అవి ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతా నుండి కట్ చేస్తాయి. మొత్తం మీద ఏప్రిల్ 10 నుండి హైవే ఎక్కే ముందు మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు, లేదంటే అనవసరంగా జరిమానా కట్టాల్సి వస్తుంది.

Spotlight

Read More →