దేశంలోనే తొలి 'మహిళా' బస్ డిపో ను రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజిని నగర్ లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ డిపోకు సఖి డిపో అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే అని..దీని కోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే చాలామంది మహిళలు బస్ కండక్టర్లుగా, ఇతర సిబ్బందిగా తమ సేవలు అందిస్తున్నారని.. ఇకపై డ్రైవర్లుగానూ తమ ప్రతిభను చాటుకుంటారని అన్నారు. దేశంలో ఇది ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత! హోంమంత్రి అనితను కలిసిన సమయంలో!
నిరసన తెలిపిన మహిళా ఉద్యోగులు
కాగా దేశంలోనే తొలి 'మహిళా' బస్ డిపోను ప్రారంభించడం మంచిదే అయినా.. ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రి ఎదుట నిరసన చేపట్టారు. ఫిక్స్డ్ జీతం, పర్మినెంట్ ఉద్యోగాలకు మంత్రి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరు కావాలంటే ఉదయం 6 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి.. కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలని.. అయినా ఒక్కోసారి సమయానికి పని ప్రదేశానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి కైలాశ్ గహ్లోత్ వారి డిమాండ్లు నెరవేరుస్తామని, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: