ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది? ఉష్ణోగ్రతలు తగ్గాయా.. పెరిగాయా?.. సాధారణంగా ఇలాంటి సమాచారాన్ని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అలాగే గూగుల్ వెదర్ రిపోర్ట్ ను కూడా మనం చూస్తుంటాం. అయితే ఇవన్నీ ఏ రోజుకారోజు లేదా ఒకటి రెండు రోజుల ముందస్తు సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. కానీ ఇక నుంచి 15 రోజుల ముందే తెలుసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ కు చెందిన డీప్మెండ్ ల్యాబ్ రీసెర్చర్స్ ఇప్పుడు తావావరణాన్ని అంచనా వేసే కొత్త ఏఐ మోడల్ ను రూపొందించారు. దీనికి జెన్ కాస్ట్ అని పేరు పెట్టారు.
ఇంకా చదవండి: బయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ! నెల రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
ఇప్పటి వరకు వాతావరణ అంచనాల కోసం అందుబాటులో ఉన్న వనరులు, టెక్నాలజీ ద్వారా వెదర్ను అంచనా వేయడానికి గంటలకొద్దీ సమయం తీసుకునేది. కానీ 'జెన్ కాస్ట్' డివైజ్ కేవలం 8 నిమిషాల్లోనే ఆ సమాచారాన్ని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే దీనిని అందరికీ అందుబాటులోకి తేవాలని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇంకా చదవండి: సర్దార్ గౌతు లచ్చన్నపై గౌరవంతోనే వైకాపా నాయకుడు వచ్చినా భరించాం! తెదేపా నేతలు సహకారంపై...!
వరదలు, తుపాన్లు, అధిక, అత్యల్ప వర్షపాతాలు వంటి సమాచారాన్నంత ఈ జెన్ కాస్ట్ అనే పరికరం ఎప్పటికప్పుడు క్రోడీకరించి, ఎనలైజ్ చేసి అందిస్తుంది. అంతేకాకుండా ఇది 50 వేర్వేరు వెదర్ రిపోర్ట్లను కూడా ఒకేసారి ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జెన్ కాస్ట్ కు 40 ఏండ్ల వెదర్ ఇన్ఫర్మేషన్ తో నిపుణులు ట్రైనింగ్ ఇచ్చారు. గాలి, ఉష్ణోగ్రతలు, వరదలు, తుపానులు, వాతావరణ మార్పులు, ప్రమాద హెచ్చరికలు వంటి విషయాలను ఈ పరికరం నేర్చుకుందని నిపుణులు అంటున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: