Sports News: భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! Cricket: సంక్షోభంలో శ్రీలంక క్రికెట్.. అధ్యక్షుడితో సహా బోర్డు మొత్తం రాజీనామా! గతంలోనూ బోర్డుపై.. IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., Sports News: భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! Cricket: సంక్షోభంలో శ్రీలంక క్రికెట్.. అధ్యక్షుడితో సహా బోర్డు మొత్తం రాజీనామా! గతంలోనూ బోర్డుపై.. IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్.,

Shivam Dube: అహ్మదాబాద్‌లో దూబే తుపాన్: కేవలం 8 బంతుల్లో 26 పరుగులు.. భారత్ స్కోరు.?

ICC T20 WorldCup 2026: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో, ఆఖరి ఓవర్లలో భారత బ్యాటర్ శివమ్ దూబే సృష్టించిన విధ్వంసం టీమిండియా అభిమానులను అలరించింది.

Published : 2026-03-08 21:06:00
  • అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు..
     
  • అదరగొట్టిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్..

ICC T20 WorldCup 2026: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో పరుగుల జాతర జరిగింది. లక్షలాది మంది అభిమానుల కోలాహలం మధ్య టీమిండియా బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఆరంభంలో ఓపెనర్ల మెరుపులు, మధ్యలో సంజూ శాంసన్ క్లాస్ ఇన్నింగ్స్, చివర్లో శివం దూబే విధ్వంసంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు లేకుండా, కివీస్ పేసర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.

మెరుపు హాఫ్ సెంచరీ: కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లేలోనే భారత్ భారీ స్కోరుకు పునాది వేయడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కే హైలైట్ అంటే అది ఖచ్చితంగా సంజూ శాంసన్ బ్యాటింగే. వికెట్ కీపర్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన సంజూ, మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

సిక్సర్ల వర్షం: 46 బంతుల్లో 5 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేశాడు.
తృటిలో తప్పిన సెంచరీ: శతకానికి చేరువవుతున్న తరుణంలో అవుట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచినా, భారత్ 250 మార్కును చేరుకోవడానికి సంజూ ఆడిన ఇన్నింగ్స్ వెన్నెముకలా నిలిచింది. అభిషేక్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, 16వ ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ ఒక్కసారిగా భారత్‌ను భయపెట్టాడు.

వరుస వికెట్లు: సెట్ అయిన సంజూ, ఇషాన్ కిషన్లను అవుట్ చేయడమే కాకుండా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భారత్ స్కోరు కాస్త నెమ్మదించింది. స్కోరు వేగం తగ్గిందనుకున్న దశలో శివం దూబే అసలు సిసలైన ఫినిషింగ్ ఇచ్చాడు. కేవలం 8 బంతులే ఆడిన దూబే, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
నీషమ్‌కు చుక్కలు: ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో దూబే ఏకంగా 24 పరుగులు (2 సిక్సులు, 3 ఫోర్లు) రాబట్టాడు. ఈ ఫినిషింగ్ టచ్‌తో భారత్ స్కోరు 255కు చేరుకుంది. అతనికి తోడుగా తిలక్ వర్మ (8*) నాటౌట్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్రలకు తలో వికెట్ దక్కింది. ఇప్పుడు న్యూజిలాండ్ ప్రపంచకప్ గెలవాలంటే 256 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని ఛేదించాలి. టీ20 చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో ఇంత పెద్ద స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి.

Spotlight

Read More →