ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం పలు కీలక రంగాల్లో మార్పులు తీసుకొస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి, ఉద్యోగాలు, పారదర్శకతతో కూడిన నూతన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే కృషి చేస్తున్నారు.
చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అనేది కేవలం నగరాల వరకే పరిమితం కాదు ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం అందులో భాగస్వామ్యం కావాలని ఆయన ఆశయంగా పెట్టుకున్నారు. రహదారులు, నీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి పథకం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలన్నది లక్ష్యం.
అభివృద్ధి దిశగా మరో ముఖ్య అడుగు అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడం. గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ విజయమే కాకుండా భారతదేశానికి గర్వకారణం గా నిలిచింది. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో ప్రభుత్వం కలసి పనిచేసే విధానాన్ని తీసుకువస్తోంది.
ఇక రాయలసీమ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కర్నూలు జిల్లాలో రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రహదారులు, పరిశ్రమల స్థాపన వంటి పలు కార్యక్రమాలకు ఇది శ్రీకారం అవుతుంది.
ఇక మరోవైపు పరిశ్రమల అభివృద్ధి కోసం మంగళగిరిలో టాటా హిటాచి షోరూం ప్రారంభమైంది. వైసీపీ పాలనలో బుల్డోజర్లు కూల్చడానికి వాడితే, ఇప్పుడు అవి నిర్మాణానికి వాడుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలు విస్తరించడం వల్ల వేలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇకపై మద్యం విక్రయం సురక్ష యాప్ ద్వారా మాత్రమే జరగాలి. ప్రతి బాటిల్‌కు బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే అమ్మకం జరగాలని సీఎం ఆదేశించారు. ఈ విధానం ద్వారా నకిలీ మద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, పారదర్శకత ప్రజా సంక్షేమం అనే మూడు సూత్రాలపై ముందుకు సాగుతోంది. గ్రామీణ అభివృద్ధి నుంచి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వరకు ఆంధ్రప్రదేశ్‌ను నూతన దిశలో నడిపించే మార్గంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.