విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్‌ను తుపాకితో బెదిరించిన దోపిడీ దొంగలు అతడి ఫోన్‌తోపాటు మరికొన్ని వస్తువులను లాక్కెళ్లారు. తుపాకి గురిపెట్టడంతో వణికిపోయిన అలెన్ దొంగలు అడిగినవి కిమ్మనుకుండా సమర్పించుకున్నాడు. విండీస్ బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జట్టు బస చేసిన శాండ్‌టన్ సన్ హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అంతర్జాతీయ ఆటగాడికి కనీస భద్రత లేకుండా పోయిందని, సౌతాఫ్రికాలో ఇలాంటి పరిస్థితిని ఊహించలేదంటూ క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. సౌతాఫ్రికా బోర్డుపై విమర్శల గుప్పిస్తున్నారు. అలెన్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని విండీస్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. అలెన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి