Railway Curve: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కర్వ్ మన ఆంధ్రాలోనే.. ఎక్కడో తెలుసుకోండి! ఆ రోజు బ్రిటిష్ వారు.. AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! space technology: అంతరిక్షంలో భారత్ సరికొత్త అడుగు..! 8 వేల ప్రయోగాలు.. ఒకే లక్ష్యం! Gold and silver: బంగారం, వెండి ధరలు పతనం… కెవిన్ వార్ష్ నామినేషన్ ఎఫెక్ట్! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! కళ్లు చెదిరే ధరలు... చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్లు ఇవే! AI Healthcare: వంశపారంపర్య జబ్బులకు ముందే చెక్.. గూగుల్ డీప్‌మైండ్ సరికొత్త ఆవిష్కరణ.! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! Railway Curve: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కర్వ్ మన ఆంధ్రాలోనే.. ఎక్కడో తెలుసుకోండి! ఆ రోజు బ్రిటిష్ వారు.. AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! space technology: అంతరిక్షంలో భారత్ సరికొత్త అడుగు..! 8 వేల ప్రయోగాలు.. ఒకే లక్ష్యం! Gold and silver: బంగారం, వెండి ధరలు పతనం… కెవిన్ వార్ష్ నామినేషన్ ఎఫెక్ట్! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! కళ్లు చెదిరే ధరలు... చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్లు ఇవే! AI Healthcare: వంశపారంపర్య జబ్బులకు ముందే చెక్.. గూగుల్ డీప్‌మైండ్ సరికొత్త ఆవిష్కరణ.! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి!

Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన నిజాలు బయటపెట్టారు. 2022లో కల్తీ నివేదికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Published : 2026-01-31 13:19:00

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. ఈ అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం నిర్వహించి గత వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన ప్రసాదంలో నాణ్యత లేకుండా చేయడం క్షమించరాని నేరమని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం అత్యంత పవిత్రమైందని, అలాంటి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే తిరుమల తిరుపతి దేవస్థానాలు కఠిన నిబంధనలు తీసుకువచ్చిందని మంత్రి వివరించారు.

నెయ్యి సరఫరా చేసే సంస్థలకు పాడిపరిశ్రమలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని, రూ.250 కోట్ల టర్నోవర్ తప్పనిసరిగా ఉండాలని, రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలనే షరతులు పెట్టినట్లు తెలిపారు. ఈ నిబంధనలు భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే ఉద్దేశంతోనే రూపొందించారని అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిబంధనలను సడలించడంతోనే అవినీతికి బీజం పడిందని ఆరోపించారు. అప్పట్లో లడ్డూ నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తామే ఆందోళనలు చేశామని గుర్తు చేశారు.

దేవదేవునికి భక్తితో సేవ చేయాల్సిన వారు ధనార్జనకే పరిమితమై తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మంత్రి మండిపడ్డారు. 2022లోనే నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదికలు స్పష్టం చేశాయని, అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆ రిపోర్టులను పక్కనపెట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కల్తీ జరిగిందని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలా చేయకపోవడం దేవదేవుడి పట్ల నమ్మకం లేనట్టేనా అని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో అప్పట్లో వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే వ్యక్తి ఒక డెయిరీ సంస్థను సంప్రదించి లీటరుకు రూ.25 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. వారు ఒప్పుకోకపోవడంతో నిబంధనల్లోకి రారని సర్టిఫికెట్ ఇప్పించి డిస్‌క్వాలిఫై చేయించారని, తరువాత ఇతర మార్గాల్లో కంపెనీల పేర్లు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపణలు గుప్పించారు.

తమ ఇంటిదైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు నాయుడు కొలుస్తారని, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తిరుమల ప్రక్షాళన చర్యల్లో భాగంగానే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని NDDB నివేదికలో స్పష్టంగా ఉందని, సిట్ నివేదికలోని 35వ పేజీ చూస్తే నిజాలు అర్థమవుతాయని పేర్కొన్నారు.

6-7-2024, 23-7-2024 తేదీల్లో వచ్చిన నివేదికల్లో వృక్షజన్య నూనెలు, జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని సిట్ తెలిపిందన్నారు. అయినా వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామిపై వైసీపీ నేతలకు నిజమైన నమ్మకం లేదని ఈ వ్యవహారంతో తేలిపోయిందన్నారు. నాడు ముఖ్యమంత్రి సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించలేదని, అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను కూడా పట్టించుకోలేదని విమర్శించారు.

కల్తీ కుట్ర వెనుక ఉన్న సూత్రధారి ఎవరో తేలాలని మంత్రి డిమాండ్ చేశారు. 2022లో CFTRI ఇచ్చిన నివేదికను నాటి జగన్ ప్రభుత్వం తొక్కిపెట్టిందని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే ఆ నిజాలు బయటపడ్డాయని అన్నారు. సిట్ చార్జ్‌షీట్‌లో కూడా జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా ఉందని, అయినా గుళ్లు కడుగుతాం, మెట్లు కడుగుతాం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలో లేదా ఫిష్ ఆయిల్ లేదని ఏ నివేదిక చెప్పిందో వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పాలని మంత్రి పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు.

Spotlight

Read More →