Railway Curve: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కర్వ్ మన ఆంధ్రాలోనే.. ఎక్కడో తెలుసుకోండి! ఆ రోజు బ్రిటిష్ వారు.. AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! space technology: అంతరిక్షంలో భారత్ సరికొత్త అడుగు..! 8 వేల ప్రయోగాలు.. ఒకే లక్ష్యం! Gold and silver: బంగారం, వెండి ధరలు పతనం… కెవిన్ వార్ష్ నామినేషన్ ఎఫెక్ట్! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! కళ్లు చెదిరే ధరలు... చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్లు ఇవే! AI Healthcare: వంశపారంపర్య జబ్బులకు ముందే చెక్.. గూగుల్ డీప్‌మైండ్ సరికొత్త ఆవిష్కరణ.! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! Railway Curve: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కర్వ్ మన ఆంధ్రాలోనే.. ఎక్కడో తెలుసుకోండి! ఆ రోజు బ్రిటిష్ వారు.. AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! space technology: అంతరిక్షంలో భారత్ సరికొత్త అడుగు..! 8 వేల ప్రయోగాలు.. ఒకే లక్ష్యం! Gold and silver: బంగారం, వెండి ధరలు పతనం… కెవిన్ వార్ష్ నామినేషన్ ఎఫెక్ట్! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! కళ్లు చెదిరే ధరలు... చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్లు ఇవే! AI Healthcare: వంశపారంపర్య జబ్బులకు ముందే చెక్.. గూగుల్ డీప్‌మైండ్ సరికొత్త ఆవిష్కరణ.! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి!

కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు!

అసలు సరఫరా అయింది నెయ్యే కాదు – రసాయన మిశ్రమమని సిట్ నిర్ధారణ – ఎన్‍డీడీబీ నివేదికపై వైసీపీ గందరగోళం – భక్తుల మనోభావాలతో చెలగాటం – తిరుమల పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధం.

Published : 2026-01-31 12:27:00
  • ఇది నెయ్యి కాదు.. రసాయనాల రంగుల విందు!
  • ఎన్‍డీడీబీ వర్సెస్ ఐసీఏఆర్: ఏది నిజం?
  • రాజకీయ బుకాయింపులు - భక్తుల ఆవేదన..

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చిచ్చు రేపింది. వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని, అది పూర్తిగా రసాయనాల మిశ్రమమని సిట్ (SIT) తన ఛార్జ్ షీట్‌లో స్పష్టం చేయడంతో భక్తులు విస్మయానికి గురవుతున్నారు. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న వాదనలు విడ్డూరంగా ఉన్నాయి. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని తమకు తామే 'సెల్ఫ్ సర్టిఫికేట్' ఇచ్చుకుంటూ, ఉల్టా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, అత్యున్నత సంస్థ అయిన ఎన్‍డీడీబీ (NDDB) ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో ప్రభుత్వం లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటించింది. ఇదే విషయాన్ని సిట్ కూడా తన దర్యాప్తులో నిర్ధారించింది. కానీ, మధ్యలో ఐసీఏఆర్ (ICAR) నివేదికను అడ్డం పెట్టుకుని వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపింది. కొవ్వును గుర్తించే సాంకేతికత తమ దగ్గర లేదని, తాము అనుసరించిన పద్ధతిని వేరే సంస్థలు ధ్రువీకరించాల్సి ఉందని ఐసీఏఆర్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. దానిని వక్రీకరిస్తూ "కొవ్వు లేదని తేలిపోయింది" అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.

అసలు తిరుమలకు సరఫరా అయింది నెయ్యే కానప్పుడు, అందులో రసాయనాలు, పామాయిల్ వాడటం నిజమని తేలాక.. ఇక జంతువుల కొవ్వు ఉందా లేదా అనే చర్చతో ప్రజలను పక్కదారి పట్టించడం వైసీపీ ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవదేవుడైన వేంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఇంతటి మహాపాతకానికి ఒడిగట్టి కూడా, తప్పును ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం హిందూ సమాజాన్ని మరోసారి మోసం చేయడమేనని భక్తులు మండిపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు చేస్తున్న డిమాండ్లు కేవలం రాజకీయం కోసమే తప్ప, అందులో నిజాయితీ లేదని స్పష్టమవుతోంది.

తిరుమల వెంకన్న ప్రసాదం అంటే కోట్లాది మందికి ప్రాణం. అలాంటి పవిత్రమైన చోట జరిగిన ఈ అపరాధంపై రాజకీయాలు చేయడం దురదృష్టకరం. సిట్ తన దర్యాప్తును ముగించి నిందితులను కోర్టు ముందు నిలబెట్టాలని, స్వామివారి పవిత్రతను కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు.

Spotlight

Read More →