pawan kalyan: "తమిళనాడులో జనసేనాని గర్జన": నేడు నాగర్‌కోయిల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్. Chandrababu: ఏపీ తీరంలో ఇతర రాష్ట్రాల బోట్ల హంగామా... సీఎం చంద్రబాబు సీరియస్, కఠిన ఆదేశాలు! Amaravati Development: అమరావతికి చట్టబద్ధత... రాజధానిని చుట్టుముట్టిన 60 వేల మంది సైన్యం! Praja Vedika: నేడు (06/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Polavaram Project: పోలవరం పనుల్లో భారీ పురోగతి.. అత్యాధునిక విదేశీ మిషనరీ! అతి సుందరంగా మారుతున్న.... Iconic & Justice City: భారతదేశంలోనే అరుదైన ఎలివేషన్.. ముగింపు దశకు పునాది పనులు! 15వ పోర్ కాంక్రీటింగ్ పూర్తి.. ఇక మిగిలింది ఒక్కటే! Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం! ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకోం... AP Development: ఏపీకి కనకవర్షం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ- చంద్రబాబు విజన్... AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.! Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు.. pawan kalyan: "తమిళనాడులో జనసేనాని గర్జన": నేడు నాగర్‌కోయిల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్. Chandrababu: ఏపీ తీరంలో ఇతర రాష్ట్రాల బోట్ల హంగామా... సీఎం చంద్రబాబు సీరియస్, కఠిన ఆదేశాలు! Amaravati Development: అమరావతికి చట్టబద్ధత... రాజధానిని చుట్టుముట్టిన 60 వేల మంది సైన్యం! Praja Vedika: నేడు (06/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Polavaram Project: పోలవరం పనుల్లో భారీ పురోగతి.. అత్యాధునిక విదేశీ మిషనరీ! అతి సుందరంగా మారుతున్న.... Iconic & Justice City: భారతదేశంలోనే అరుదైన ఎలివేషన్.. ముగింపు దశకు పునాది పనులు! 15వ పోర్ కాంక్రీటింగ్ పూర్తి.. ఇక మిగిలింది ఒక్కటే! Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం! ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకోం... AP Development: ఏపీకి కనకవర్షం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ- చంద్రబాబు విజన్... AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.! Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు..

Chandra Babu: అనంతపురంలో సీఎంచంద్రబాబు పర్యటన! నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి..

Chandra Babu Naidu: రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Published : 2026-04-06 10:43:00

యాడికిలో రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం.. 

జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌.. 

రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

యాడికిలో రైతులు, సాగునీటి సంఘాల సభ్యులతో సీఎం సమావేశం కానున్నారు. నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి నీటి సంరక్షణపై అవగాహన పెంచే దిశగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సందర్భంగా జల వనరుల సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను యాడికి నుంచే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి జూలై 14 వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జల సంరక్షణలో భాగంగా సుమారు 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి కార్యాచరణను అమలు చేయనున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని అధికారులు తెలిపారు.

భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. వేసవిలో కనీసం 6 మీటర్లు, వర్షాకాలం తరువాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే వర్షపు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేలా సమగ్ర నీటి వినియోగ ప్రణాళికను అమలు చేయనున్నారు.

భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న నేపథ్యంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. నీటి వనరులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఇప్పటికే ‘అవేర్ 2.0’ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.

నేడు సాగునీటి సంఘాలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి మరిన్ని సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి సంరక్షణకు కొత్త దిశ దక్కుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →