AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు..

Free cycles distribution: పిల్లల చదువు భారం కాకూడదు - సైకిళ్ల పంపిణీలో మంత్రి గొట్టిపాటి భావోద్వేగ ప్రసంగం..!!

అద్దంకి నియోజకవర్గంలో 8 వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. దాతల సహకారంతో త్వరలోనే పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా

Published : 2026-03-01 19:55:00

మంచి పనులకు దాతల అండ

త్వరలో పాఠశాలల్లో తాగునీటి ప్లాంట్లు

విద్యలో రాజకీయాలకు తావులేదు

పేద విద్యార్థుల చదువుకు రవాణా కష్టాలు సమస్య కాకూడదనే సంకల్పంతో అద్దంకి నియోజకవర్గంలో చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఒక మహా యజ్ఞంలా కొనసాగుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. బల్లికురువ మండలం వేమవరం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మరో 44 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేవలం స్కూల్ విద్యార్థులకే కాకుండా ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే పేద విద్యార్థులకు కూడా వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ 8 వేల సైకిళ్లలో వెయ్యి సైకిళ్లను తమ సొంత కంపెనీ ద్వారా అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మనం చేసే పని మంచిదైతే సమాజం నుంచి దాతలు తప్పకుండా సహకరిస్తారు అని చెప్పడానికి ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనమని మంత్రి అన్నారు.

విద్యార్థుల కోసం తాము పడుతున్న తపన చూసి ఒక దాత స్పందించి, పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.12 లక్షల విరాళం ఇచ్చారని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఈ నిధులతో త్వరలోనే నియోజకవర్గంలోని 8 పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

గత ప్రభుత్వ పాలనలో పేద విద్యార్థుల పట్ల జరిగిన వివక్షను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఒకసారి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఒక తండ్రి తన వద్దకు వచ్చి.. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు వేస్తున్నారు, రెండో వాడిని కూలికి పంపాలా? అని అడిగిన ప్రశ్న తనను కలచివేసిందని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సానుకూలంగా స్పందించి 'తల్లికి వందనం' పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నారని తెలిపారు.

లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కొనియాడారు. విద్యార్థులకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాంల విషయంలో ఎక్కడా రాజకీయ రంగులు ఉండకూడదని, సకాలంలో నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామని చెప్పారు. సైకిళ్ల పంపిణీ విషయంలోనూ తాను ఎటువంటి రాజకీయ రంగులు వేయవద్దని ఆదేశించానని, పిల్లలు చదువుకుంటే వాటంతట అవే అర్థమవుతాయని గొట్టిపాటి పేర్కొన్నారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు.

Spotlight

Read More →