Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్!

AP Politics: లడ్డూ కల్తీ పాపం నుంచి జగన్ తప్పించుకోలేరు..! మంత్రి బాల వీరాంజనేయస్వామి ఘాటు వ్యాఖ్యలు!

AP Politics: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దావగూడూరులో పింఛన్లు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న భారీ పింఛన్ల గురించి వివరించారు. లడ్డూ కల్తీ మరియు తీర్థం స్వీకరించని ఘటనను ప్రస్తావిస్తూ జగన్‌కు హిందూ ధర్మంపై గౌరవం లేదని విమర్శించారు.

Published : 2026-02-28 13:26:00

చంద్రబాబు హయాంలోనే వృద్ధులకు అసలైన భరోసా…

భక్తుల మనోభావాలు గాయపర్చిన వైసీపీ సర్కార్…

పింఛన్ పెంపుపై జగన్ మోసం…

AP Politics: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో పర్యటించారు. 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు. దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి కొనియాడారు.

ప్రస్తుత ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని మంత్రి వివరించారు. గతంలో ఉన్న పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచి, వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ. 15 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛన్ పెంపు విషయంలో వైఎస్ జగన్ మాట తప్పి వృద్ధులను మోసం చేశారని, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల పక్షాన నిలబడి ఆర్థిక భరోసా కల్పించారని మంత్రి విమర్శించారు. ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి డబ్బులు అందడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను మంత్రి తీవ్రంగా ఖండించారు. కేవలం కాసుల కక్కుర్తితో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. భగవంతుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతేనే భక్తులు ఎంతో బాధపడతారని, అలాంటిది సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ నేతలు పారిపోతున్నారని, వారు సభ నుంచి తప్పించుకున్నా భగవంతుడి శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

వైఎస్ జగన్‌కు హిందూ ధర్మం పట్ల కనీస గౌరవం లేదని మంత్రి విమర్శించారు. కడప జిల్లాలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ పూజారి ఇచ్చిన తీర్థాన్ని జగన్ తీసుకోకుండా కింద పడేశారని గుర్తుచేశారు. తీర్థం స్వీకరించడానికి ఇష్టపడని వ్యక్తి విగ్రహ ప్రతిష్టలకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. హిందూ ఆచారాలను పాటించని వారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేవాలయాలపై దాడులు, సంప్రదాయాల ఉల్లంఘన పరాకాష్టకు చేరిందని మంత్రి ఆరోపించారు.
 

Spotlight

Read More →