Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల!

GHMC: జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం! అక్రమాలకు చెక్.. రోడ్లకు డిజిటల్ ఐడి!

హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు చేయకపోయినా బిల్లులు వసూలు చేసే అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలోని అన్ని

Published : 2025-09-01 09:42:00

హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు చేయకపోయినా బిల్లులు వసూలు చేసే అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలోని అన్ని రహదారుల వివరాలను డిజిటలైజ్ చేసి డేటాబేస్‌లో నమోదు చేయనుంది. ప్రతి రోడ్డుకు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయిస్తారు.

దీనికోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆ యాప్‌లో ప్రతి రోడ్డుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. రోడ్డు ఎప్పుడు నిర్మించబడింది, ఏ ఏజెన్సీ పని చేసింది, డీఎల్పీ (Defect Liability Period) ఎంతవరకు ఉంది అనే వివరాలు నమోదు అవుతాయి. ఇలా చేయడం వల్ల రోడ్లను సరిగా మరమ్మతు చేయకపోయినా బిల్లులు వేసే దందాకు అడ్డుకట్ట పడుతుంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 9103 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో GHMC పరిధిలో ఉన్న రోడ్లు, R&B, NHAI, TGICC పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు క్షేత్రస్థాయి సర్వే ద్వారా సేకరించనున్నారు. ఈ వివరాలు కూడా ఆ యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి.

యాప్‌లో రోడ్డుకు సంబంధించిన అధికారుల సమాచారం కూడా జతచేస్తారు. దాంతో రోడ్డుపై సమస్య ఉంటే, దానికి బాధ్యుడు ఎవరో సులభంగా గుర్తించవచ్చు. దీంతో అక్రమాలకు చెక్ పడటమే కాకుండా, అధికారుల పనితీరు కూడా పారదర్శకంగా మారుతుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజాధనం వృథా కాకుండా కాపాడే అవకాశం ఉంది. ఒక్క క్లిక్‌తో రోడ్ల వివరాలు తెలుసుకోవచ్చని, రోడ్ల నాణ్యత, మరమ్మతులపై పర్యవేక్షణ సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో రోడ్ల సమస్యలు తగ్గి, ప్రజలకు నేరుగా లాభం చేకూరనుంది.

Spotlight

Read More →