AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు..

New Ration Card Application: రేషన్ కార్డు కావాలా? అయితే వెయిట్ చేయక్కర్లేదు.. సీఎం కొత్త ప్లాన్ ఇదే!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డుల జారీ ఇకపై నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, 99 రోజుల పాటు 'ప్రజా పాలన' కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.

Published : 2026-03-01 09:22:00

99 రోజుల పాటు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ఫోకస్

సాంకేతికతతో ఇంటి వద్దకే సేవలు

తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది ఒక పండుగలా కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతర ప్రక్రియ'గా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. అంటే, ఇకపై రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు.

రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లేందుకు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం మార్చి 6వ తేదీన ప్రారంభమై, జూన్ 12 వరకు.. అంటే దాదాపు 99 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఈ 99 రోజుల ప్రణాళికను అత్యంత బాధ్యతగా అమలు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పరిపాలనలో భారీ మార్పులు తీసుకురావాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మెజారిటీ సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే పొందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా వంద మండలాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌'ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా పేదలకు నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ప్రాధాన్యత ఇచ్చి, లబ్ధి చేకూర్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Spotlight

Read More →