Visakha Metro: విశాఖ మెట్రోలో భారీ మార్పు... కొత్త రూట్ ఫిక్స్! ఆ ప్రాంతాలకు మహర్దశ! H-City Project: పాతబస్తీకి సరికొత్త వెలుగులు.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ' ప్రాజెక్ట్! అడ్డంకులు తొలగించి.. Metro Projects: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు కొత్త జోష్ - ₹11 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!! 2030 నాటికి డెడ్ లైన్… Amaravati Quantum Valley: అమరావతిలో ఆకాశహర్మ్యాలు.... రూ.1,200 కోట్లతో క్వాంటం టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్! విద్యుత్ శాఖపై సమీక్ష.. ఆపై విశాఖ పర్యటన!! Praja Vedika: నేడు (27/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Visakha Metro: విశాఖ మెట్రోలో భారీ మార్పు... కొత్త రూట్ ఫిక్స్! ఆ ప్రాంతాలకు మహర్దశ! H-City Project: పాతబస్తీకి సరికొత్త వెలుగులు.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ' ప్రాజెక్ట్! అడ్డంకులు తొలగించి.. Metro Projects: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు కొత్త జోష్ - ₹11 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!! 2030 నాటికి డెడ్ లైన్… Amaravati Quantum Valley: అమరావతిలో ఆకాశహర్మ్యాలు.... రూ.1,200 కోట్లతో క్వాంటం టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్! విద్యుత్ శాఖపై సమీక్ష.. ఆపై విశాఖ పర్యటన!! Praja Vedika: నేడు (27/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం!

Festive Bonanza: దసరా, దీపావళికి ఆప్కో బంపరాఫర్లు..! చేనేత వస్త్రాలపై 40% భారీ డిస్కౌంట్..!

 నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు, దీపావళి పండుగలతో తెలుగు రాష్ట్రాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. ఈ పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్

Published : 2025-09-22 17:56:00
Tech Reality: డెవలపర్లు నుంచి మేనేజర్స్ వరకు..! ఈ ఉద్యోగాలను ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు..!

నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు, దీపావళి పండుగలతో తెలుగు రాష్ట్రాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. ఈ పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేకంగా వస్త్రాలు కొనుగోలు చేసే ప్రజలకు 40 శాతం తగ్గింపును అందజేస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ ఆఫర్‌ వినియోగదారులకు తక్కువ ధరలకు వస్త్రాలు అందిస్తే, మరోవైపు నేత కార్మికుల ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరగనుందని తెలిపారు.

ఆ ప్రయాణం.. నేటి గుర్తింపు అంటున్న మెగాస్టార్!

చేనేత ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల నేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల చేనేత సహకార సంఘాల సభ్యుల ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా రూ.3000 వరకు ఆదాయం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 89 వేల మంది నేత కార్మికులు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దీని వలన నేత కార్మికులు మరింత ఉత్సాహంగా పని చేసి అధిక ఉత్పత్తి చేయగలరని మంత్రి పేర్కొన్నారు.

రాజోలు, ఆలూరు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం! కీలక ఆదేశాలు జారీ!

అదేవిధంగా, చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నారు. పండగ సీజన్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు చేనేత ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. రాష్ట్రంలోని 92 వేల మంది నేతలకు 50 ఏళ్ల వయసులోనే పింఛను అందించడం ద్వారా ప్రభుత్వం నేతన్నల భద్రతకూ కట్టుబడి ఉందని మంత్రి సవిత వివరించారు. ఈ విధంగా పింఛను పథకం నేత కార్మికుల జీవితాలకు స్థిరత్వం తెచ్చి భవిష్యత్‌లో వారికి ఆర్థిక భరోసా కలిగిస్తుందని చెప్పారు.

మాలీవుడ్ సూపర్ స్టార్ దక్కిన అవార్డు..అభినందనలు తెలిపిన మెగాస్టార్! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్!

ఆప్కో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తాజాగా విశాఖలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆధునిక మార్కెటింగ్ వ్యూహాలు, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఆప్కోలో అమలు చేయనున్నారు. దీంతో చేనేత వస్త్రాల విక్రయాలు మరింత పెరిగి నేతన్నలకు శాశ్వత ఉపాధి లభించనుంది. పండగ సీజన్ ఆఫర్లు ఈ ప్రయత్నంలో భాగమని మంత్రి సవిత పేర్కొన్నారు. నేతన్నల కష్టానికి తగిన గౌరవం దక్కేలా, చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.

Utsav Exhibition: వినోద, విజ్ఞానం, వ్యాపారం ఒకే వేదికపై.. విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 ఉంది.. రాజ్ నాథ్
పండుగలకు, శుభకార్యాలకు రుచికరమైన రవ్వ లడ్డు! సులభంగా తయారీ!
Telangana oil palm: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రగామి.. దేశంలోనే నం.1 స్థానంలో!
ISRO: అంతరిక్షంలో భారత ఉపగ్రహానికి పెద్ద ప్రమాదం! రంగంలోకి దిగిన కేంద్రం!

Spotlight

Read More →