రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా గత పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఎత్తిపోతల పథకాలు, పూడికతీతలపై శాసనసభలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి రూ.983 కోట్లు కేటాయించాలని ప్రణాళికా సంఘం స్పష్టంగా చెప్పిందన్నారు. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం కేవలం రూ.125కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. అందుకే జలవనరుల శాఖలో ఇంత విధ్వంసం జరిగిందన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొంటామని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్రపుడెక్క తొలగించేందుకు జూన్లో తొలుత రూ.79కోట్లు కేటాయించామన్నారు. అత్యవసర పనుల కోసం రూ.284 కోట్ల నిధులు మంజూరుచేశామని.. ప్రస్తుతం టెండరు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే ఆ పనులు కూడా చేపడతామని మంత్రి వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: