Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి

కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా... హు కిల్డ్ బాబాయి?? రాయలసీమకు చేసిందేంటి? :చంద్రబాబు

ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా...హు కిల్డ్ బాబాయి?? సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేం

Published : 2024-01-20 05:52:00

ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు

కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా...హు కిల్డ్ బాబాయి??

సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటి??

రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయి...

పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ పధకాలు నేడు ఉన్నాయా?

కమలాపురం: ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని సీఎం వైఎస్ జగన్ రెడ్డిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోంది. ఈ కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న పోరాటం ప్రజల కోసమని చాటిచెప్పారని పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

2019లో కడపలో అన్నిసీట్లలో వైసీపీనే గెలిపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లాలో జగన్ ఒక్కడికి న్యాయం జరిగిందా అంటూ సెటైర్లు వేశారు. అతనితోపాటు మరో ఇద్దరు,ముగ్గురు బాగుపడ్డారని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం. పులివెందుల ప్రజలు ఇలాంటివాడినా తాము గెలిపించింది అని బాధపడుతున్నారు. కడపజిల్లాలో కరువు వచ్చి, 35 మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం జిల్లాలో ఎప్పుడూ నమోదు కాలేదు. కానీ జిల్లాలో కరువు మండలాలను సీఎం ప్రకటించడం లేదు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు. కథలు చెప్పాడు.. ముద్దులు పెట్టాడు. చివరకు ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు అన్నారు చంద్రబాబు.

హూ కిల్డ్ బాబాయ్? ఈ స్టోరీ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపిస్తుంది. ఎన్నో మలుపులు ఉన్నాయని వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రెడ్డికి నేడు వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ కావాలని కోర్టుకెళ్లారు, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని ఆరోపించారు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా...హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి?

టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ పధకాలు నేడు ఉన్నాయా? రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. వైసీపీ నేతలు పెన్నా నది నుంచి ఇసుక దొంగ రవాణా చేస్తున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొడుతున్నారు. టీడీపీ నాణ్యమైన మద్యం రూ. 60 కి విక్రయిస్తే నేడు నాసిరకం మద్యం రూ. 250 కి విక్రయిస్తున్నారు. పైగా మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు.

పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ రేట్లు అన్ని రేట్లు పెంచారు. ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారు. అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటార్లు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు పెంచేది లేదని’ చంద్రబాబు స్పష్టం చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కడప స్టీల్ ఫాక్టరీ రిబ్బన్లు కట్ చేయటం రంగులు వేసుకోవటం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు చంద్రబాబు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామన్నారు.

గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. కానీ నేడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →