Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్!

సీఎం దావోస్ స్వాగతంలో! ఇద్దరు జగిత్యాల వాసుల ప్రముఖపాత్ర!

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ (ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సమావేశం) లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్

Published : 2024-01-17 18:44:00

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ (ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సమావేశం) లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 15న జ్యురిక్ విమానాశ్రయానికి చేరిన సందర్బంగా స్విట్జర్లాండ్ లోని తెలుగు ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రప్రథమ అధికారిక విదేశీ పర్యటన స్వాగత కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు మహ్మద్ ఇమ్రాన్, మంద భీంరెడ్డి లు కీలకపాత్ర పోషించారు. ఇంటా బయటా ఒకే ఊరివారు అవకాశం వస్తే తమ ఆదరాభిమానాలు ప్రదర్శించి సమన్వయంతో పనిచేస్తారు అనేదానికి ఈకార్యక్రమం నిదర్శనం. 

ప్రపంచంలో ముఖ్యమైన ఆర్ధిక కేంద్రంగా భావించే స్విట్జర్లాండ్ లో గత 20 ఏళ్లుగా నివసిస్తున్న మహ్మద్ ఇమ్రాన్ ది జగిత్యాల పట్టణం ఖిలాగడ్డ. ఒక బహుళజాతి సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఇమ్రాన్ జ్యురిక్ లోని తెలుగు ప్రముఖులలో ఒకరు. స్థానిక స్విస్ తెలుగు ప్రవాసులతో అనుసంధానం చేస్తూ సీఎం స్వాగత కార్యక్రమం విజయవంతానికి ఆయన కృషి చేశారు.

జగిత్యాలకు సమీపంలోని నాగునూరు - లచ్చక్కపేట కు చెందిన వలస వ్యవహారాల విశ్లేషకులు, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ముఖ్యమంత్రి ప్రయాణించిన విమానంలోనే ఢిల్లీ నుంచి జ్యురిక్ కు వెళ్ళి అక్కడి ప్రవాసీయులతో కలిసి సమన్వయం చేయడంతో స్వాగత కార్యక్రమం విజయవంతమైంది.

స్విట్జర్లాండ్ లోని జెనీవాలో లో జరుగనన్న ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గోనడానికి భీంరెడ్డి అక్కడికి వెళ్ళారు. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ల ప్రోత్సాహం మేరకు తాను రేవంత్ రెడ్డి స్వాగత కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్లు ఆయన తెలిపారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →