Mahanadu : టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్‌గా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Greater Vijayawada: విజయవాడ @ 75... గ్రేటర్ విజయవాడలో విలీనం కానున్న 75 గ్రామ పంచాయతీలు! AP HighCourt: ఆడబిడ్డల ఆస్తి హక్కుపై ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు! Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు! Mahanadu : టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్‌గా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Greater Vijayawada: విజయవాడ @ 75... గ్రేటర్ విజయవాడలో విలీనం కానున్న 75 గ్రామ పంచాయతీలు! AP HighCourt: ఆడబిడ్డల ఆస్తి హక్కుపై ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు! Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు!

నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు...

నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, గౌరవ అతిధిగా సి.ఎస్. హాజరు ఎన్నికల జాబితా నిర్వహణ

Published : 2024-01-25 05:19:00

నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, గౌరవ అతిధిగా సి.ఎస్. హాజరు

ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన ముగ్గురు జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి : 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా, ప్రభుత్వప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి గౌరవ అతిధిగా ఈ వేడులకు హాజరవుతున్నారన్నారు.

ఉదయం 11.32 గంటలకు జాతీయ గీతాలాపన తదుపరి ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. స్వాగతోపన్యాసం తదుపరి గౌరవ అతిధి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ప్రసంగిస్తారన్నారు.

అనంతరం గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులు అందజేయడంతో పాటు ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు జిల్లాల కలెక్టర్లు సుమిత్ కుమార్ (అల్లూరి సీతారామరాజు జిల్లా), నాగలక్షీ (విజయనగరం జిల్లా) మరియు ఎస్.డిల్లీ రావు (ఎన్.టి.ఆర్. జిల్లా) కు పురస్కారాలను అందజేస్తారన్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అదే విధంగా ముగ్గురు ఇ.ఆర్.ఓ.లు నెల్లూరు మున్సిఫల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్.డి.సి. కె.వి.రామలక్ష్మీ, భీమునిపట్నం ఆర్.డి.ఓ. ఎస్.భాస్కర్ రెడ్డి, ముగ్గురు ఏ.ఇ.ఆర్.ఓ.లు కోడుమూరు మండలం తాసీల్దారు బి.జయన్న, మైదుకూరు తాసీల్దారు బి.అనురాధ, గిద్దలూరు తాసీల్దారు డి.సీతారామయ్య మరో 23 మంది బి.ఎల్.ఓ.లకు మరియు తమ కార్యాలయానికి చెందిన ఎస్.ఓ. జి.శ్రీనివాసరావు, ఏ.ఎస్.ఓ. బి.సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందికి ఈ అవార్డులను ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తర్వాత వేడుకలకు హాజరైన వారందరితో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను చేయించడం జరుగుతుందని, ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12.13 గంటలకు ముఖ్యఅతిథి ప్రసంగం ఉంటుందని, అనంతరం జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. విజయవాడ నగర ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →