Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ! Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... కొత్త పేర్లు ఇవే! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ! Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... కొత్త పేర్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలుసు!! కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలుసు... కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరికలు నాయకులతో అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదు.... తటస్థంగా ఉ

Published : 2024-01-10 04:46:00

ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలుసు... కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరికలు

నాయకులతో అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదు....

తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోండి...

ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫాం-7లు పెట్టినవారు...

నకిలీ ఓట్లు చేర్పించేందుకు భారీగా ఫాం-6లు పెట్టిన వారి వెనక ఎవరు నడిపించారో తేల్చండి.

మూలాల్లోకి వెళ్లి కేసులు నమోదు చేయాల్సిందే...

సరిహద్దుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు సరిగ్గా లేదు ??

ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలుసు. ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరిపై మా దగ్గర నివేదికలున్నాయి. ఏ అధికారైనా సరే.. ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా, వారికి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలుంటాయి అని కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ, ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయని, అలాంటివారిని ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోవాలని, తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక జారీచేసింది. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 దరఖాస్తులు పెడుతుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదని నిలదీసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్,

నోవోటెల్ హోటల్లో మంగళవారం సమీక్ష నిర్వహించింది. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నా.. వాటిని ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించింది.

మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ వివిధ పార్టీలతో భేటీ అయిన సీఈసీ బృందం.. వారినుంచి ఫిర్యాదులు స్వీకరించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకూ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటరు కార్డులు సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో నిందితులెవరో, బాధ్యులెవరో రెండున్నరేళ్లు అవుతున్నా ఎందుకు గుర్తించలేదని తిరుపతి కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి ని నిలదీసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. కలెక్టర్ చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకు ఫాం-6 దరఖాస్తులు వేల ల్లో ఎలా వస్తాయని, అదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఈ విషయంలో ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. వీటన్నింటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరుపతి జిల్లాలోని ఫిర్యాదులు, అక్రమాలపై ఆ జిల్లా కలెక్టర్ను ప్రశ్నిస్తున్న తీరు చూసి మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి, కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా, కడప కలెక్టర్ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్ రంజిత్ పాషా పైనా సీఈసీ కమిషనర్లు అసంతృప్తి.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాపై సీఈసీ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎంత డబ్బు, మద్యం పట్టుకున్నారని ప్రశ్నలు వర్షం కురిపించింది. ఆయన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్ఫోర్స్మెంట్ ఏ మాత్రం సరిగ్గా లేదని ఆగ్రహం. వ్యక్తం చేసింది. అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటం నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టుకోవట్లేదంటూ ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ పై ఆగ్రహం వ్యక్తంచేసింది. సరిహద్దుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు సరిగ్గా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్రెడ్డిని ప్రశ్నించింది.

అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారం, వివరాలతో ఫాం-7 దరఖాస్తులు చేసిన, చేస్తున్నవారి వెనక ఎవరున్నారనేది ఎందుకు తేల్చట్లేదు? ఓట్ల తొలగింపు వల్ల అంతిమలబ్ధి ఎవరికనే అంశాలపై దర్యాప్తు ఎందుకు చేయట్లేదు. కేసులు నమోదుచేసి వదిలేస్తే ఫలితమేంటి? సూత్రధారులను పట్టుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారు?" అంటూ సీఈసీ బృందం పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను నిలదీసింది. తాము ప్రతి కేసునూ విడిగా సమీక్షిస్తామని, ఎక్కడైనా బాధ్యుల్ని తప్పించినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫాం-7లు పెట్టినవారు, నకిలీ ఓట్లు చేర్పించేందుకు భారీగా ఫాం-6లు పెట్టిన వారిని గుర్తించి వారిని వెనకనుంచి ఎవరు నడిపించారో తేల్చండి. మూలాల్లోకి వెళ్లి వారిపైనా కేసులు నమోదు చేయాల్సిందే అని స్పష్టం చేసింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →