గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి.. నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య అని దుయ్యబట్టారు. ఏపీఈఆర్సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యూనిట్ రూ.5కే వచ్చే విద్యుత్ను జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్లో రూ.8 నుంచి రూ.14కు కొనుగోలు చేసిందని ఆరోపించారు. సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపేందుకు నాడే ఏపీఈఆర్సీ అనుమతి కోరింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఆయన అవినీతి, ధన దాహం వల్లే ప్రజలపై భారం పడిందని విమర్శించారు. పవర్ ఛార్జీలు పెంచినందుకే.. ఆయనకు ప్రజలు పవర్ పీకేశారన్న విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకొని వాస్తవాలు గ్రహించాలని సూచించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!
జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!
రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: