ఎన్టీఆర్ జిల్లాలో అదృశ్యమైన 18 మంది మహిళలు, బాలికల ఆచూకీని విజయవాడ స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్ పోలీసులు గుర్తించారు. తక్కువ వ్యవధిలోనే మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు 'ఎక్స్'లో పోస్టు చేశారు. దీనిపై ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అదృశ్యమైన మహిళలు, అమ్మాయిల ఆచూకీ తెలుసుకున్న పోలీసులను అభినందించారు. “వైకాపా హయాంలో 30 వేల మందికిపైగా మహిళలు, అమ్మాయిలు అదృశ్యమయ్యారు. దీనిపై గత వైకాపా ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతిభద్రతలు కాపాడుతామని.. లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు చేస్తామని ప్రకటించాం. అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకున్న విజయవాడ పోలీసులు, హోం శాఖకు నా అభినందనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు పూర్తి భరోసా ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పోలీసు శాఖకు పూర్తి సహకారం ఉంటుంది” అని పవన్ పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: