కాకినాడ లోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితేకానీ.. చర్యలు చేపట్టరా? అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై పట్టబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్ట్లో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: