మాజీ సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. ఒప్పందాలపై మీడియాకు ఒక్క విషయం చెప్పలేదని.. ఇప్పుడు కథలు అల్లుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఒప్పందాల్లో జగన్ రూ.1,750 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఆయన 3 సార్లు అదానీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 16 సీబీఐ కేసులున్నా జగన్ ఇప్పటివరకు కోర్టుకెళ్లలేదని.. వీటిపై న్యాయస్థానాలు త్వరగా విచారణ చేపట్టాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!
శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: