గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి అనిత అధ్యక్షతన బుధవారం సచివాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును 'ఈగల్'గా మార్చడంపై చర్చించారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపింది. మంత్రులు లోకేశ్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి భేటీలో ఉన్నారు.
భేటీ అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ.. 'ఈగల్' పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా 'ఈగల్ 1972' టోల్ ఫ్రీ నంబర్ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై నిఘా పెడతామని చెప్పారు. గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని నిరోధిస్తామని మంత్రి అన్నారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!
అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అడుగులు వేస్తున్నామన్నారు. ఇందుకోసం 'మహా సంకల్పం' పేరుతో భారీగా అవగాహన సదస్సుల నిర్వహణకు కసరత్తు చేస్తున్నామన్నారు. నినాదాలు, ప్రమాణాలతో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా సదస్సులు నిర్వహిస్తామన్నారు. పోలీస్, జీఏడీ, జిల్లాల అధికార యంత్రాంగం, వైద్య, అటవీ శాఖలతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. ఐఅండ్పీఆర్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో ప్రచారం మరింత ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో గంజాయి వినియోగం లేకుండా చేసే దిశగా అన్ని మార్గాలపైనా దృష్టిసారిస్తామని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!
అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?
26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!
ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: