అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఇక్కడి నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు ఆయన చేరుకోనున్నారు. చంద్రబాబు నేటి విజయనగరం జిల్లా పర్యటన రద్దయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కారణంగా పర్యటన రద్దయింది. సీఎం పర్యటన రద్దయినట్లు మంత్రి కొండపల్లి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్లో చింతలగోరువానిపాలెంలోని లారస్ సంస్థ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు. సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి చేరుకోనున్నారు. రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్లో రుషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్ను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: