Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

రాజ్యాంగ చట్టాలకు విరుద్ధంగా రుణాల సేకరణ! జగన్ ప్రభుత్వంపై కాగ్ నివేదికలో కఠిన విమర్శలు!

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్, బెవరేజెస్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్ధం.. ఎస్ఆర్బీఎం చట్టానికి విరుద్ధమ

Published : 2024-11-23 11:46:00

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్, బెవరేజెస్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్ధం.. ఎస్ఆర్బీఎం చట్టానికి విరుద్ధమని కాగ్ తేల్చి చెప్పింది. రాష్ట్రాభివృద్ధి సంస్థను స్థాపించి, రూ. 25వేల కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. వాటిని ప్రభుత్వం తన ఆదాయాల నుంచి చెల్లించాలి. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీచేసి, సమీకరించిన రుణాలకూ రాష్ట్రప్రభుత్వమే హామీ ఇచ్చింది. ఈ రుణాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3)కి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రప్రభుత్వ ఎఫెర్బీఎం చట్టపరిధిని దాటిపోయాయని కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా నివేదిక స్పష్టం చేసింది. 'రాష్ట్రంలో ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చు ఎక్కువైపోతోంది. దీనివల్ల ఆదాయాలు భర్తీ చేసుకోవడం కష్టమవుతోంది. దీంతో ప్రజారుణాలు, బడ్జెట్లో చూపకుండా తీసుకునే అప్పులు ఏటా పెరిగిపోతున్నాయి. నిధుల సమీకరణకు కార్పొరేషన్లను ఉపయోగించడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది.



ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?




మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించే ఆస్కారం లేకుండా పోతోంది' అని పేర్కొంది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల ద్వారా దేశంలో తయారైన విదేశీ మద్యాన్ని రిటైల్గా అమ్మేందుకు బెవరేజెస్ కార్పొరేషన్కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాన్ని ఇచ్చింది. ఈ మద్యం అమ్మకం ధరపై 4% మార్జిన్ వసూలుకు ఆ కార్పొరేషన్కు అవకాశం కల్పించింది. తర్వాత మార్జిన్ను 6%కు పెంచుతూ 2020 అక్టోబరులో మరో జీవో ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బెవరేజెస్ కార్పొరేషన్ రూ.12వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర అనుమతితోనే రాష్ట్రప్రభుత్వం సంచితనిధి హామీపై రుణం తీసుకోవచ్చు. ప్రభుత్వ ఎకౌంటింగ్ నిబంధనల ప్రకారం.. అలా అప్పుగా తీసుకున్న మొత్తాన్ని మూలధన ఆస్తుల కల్పనకు ఉపయోగించాలి. ఈ విధానం వాటన్నింటినీ ఉల్లంఘించింది' అని కాగ్ పేర్కొంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ఏపీఎస్ఓసీ అంతే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కూడా ఇదే తరహాలో ఏర్పాటైంది. మద్యంపై రిటైల్ అదనపు ఎక్సైజ్ సుంకం (ఏఆస్ఈటీ) విధించి, ఆ ఆదాయాలను కార్పొరేషన్కు నిధిగా కేటాయించారు. ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు సమీకరించేందుకు వీలుగా ఎస్క్రో ఖాతాలో ఆ నిధులు జమచేసేలా ఏర్పాట్లు చేశారు. 2022-23లో ఈ కార్పొరేషన్ అప్పు తీర్చేందుకు ప్రభుత్వం రూ.3,740.61 కోట్లను ఆ ఎస్క్రో ఖాతాలో జమచేసింది. ఇదే విధానంలో రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ నుంచీ రుణాలు సమీకరించారు. ఆ నిధులు చూపి రుణాలు తెచ్చారు. ఏపీఎసీసీ, రహదారి అభివృద్ధి సంస్థలకు ఎలాంటి ఆదాయాలు లేవని.. రాష్ట్రప్రభుత్వమే ఆ అప్పులు తీర్చే బాధ్యత వహిస్తోందని కాగ్ వెల్లడించింది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

Spotlight

Read More →