అదానీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదానీ, జగన్ మధ్య ముడుపుల వ్యవహారంపై నిజాలు నిగ్గుతేల్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రికి అదానీ గ్రూప్ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ రిపోర్ట్ ఇస్తే.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఈ అంశంపై విచారణ జరిపించడం లేదని, అదానీపై ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు. లంచం తీసుకొని వైకాపా అధినేత జగన్ రాష్ట్రం పరువు తీశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అదానీపై విచారణకు జేపీసీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్‌డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: