అమెరికాలో ఉండాలంటే రూల్స్ పాటించాల్సిందే.. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ వార్నింగ్! అతి చేస్తే జైలుకే.. అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటి వద్ద కలకలం.. కిటికీ అద్దాలు ధ్వంసం.. ఒకరు అరెస్ట్! US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతుల విషాదాంతం.. అనాథలైన పిల్లలు! Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం! గ్రీన్ కార్డుపై బాంబు పేల్చిన అమెరికా..! పెళ్లి చేసుకుంటే - ఇక ఆటలు సాగవు.. నిబంధనలు మారాయి! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. తీరని వేదన.. అమెరికాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను! ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. ఒక్క రోజే 5,500లకు పైగా.. చీకటిలో వేలాది ఇళ్లు! అమెరికాలో ఉండాలంటే రూల్స్ పాటించాల్సిందే.. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ వార్నింగ్! అతి చేస్తే జైలుకే.. అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటి వద్ద కలకలం.. కిటికీ అద్దాలు ధ్వంసం.. ఒకరు అరెస్ట్! US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతుల విషాదాంతం.. అనాథలైన పిల్లలు! Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం! గ్రీన్ కార్డుపై బాంబు పేల్చిన అమెరికా..! పెళ్లి చేసుకుంటే - ఇక ఆటలు సాగవు.. నిబంధనలు మారాయి! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. తీరని వేదన.. అమెరికాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను! ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. ఒక్క రోజే 5,500లకు పైగా.. చీకటిలో వేలాది ఇళ్లు!

అమెరికాలో ఉండాలంటే రూల్స్ పాటించాల్సిందే.. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ వార్నింగ్! అతి చేస్తే జైలుకే..

2026-01-09 15:10:00

స్టూడెంట్ వీసాలపై వచ్చిన వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పెరుగుతున్న క్రైం రేటుకు బయట దేశాల నుంచి వచ్చిన వారి పాత్ర కూడా ఎక్కువగా ఉందని.. చదువుకోవడానికి వచ్చిన వారు చదువు తప్పా మిగతా వ్యవహారాలు అన్ని చేస్తున్నారని అమెరికా ఎంబసీ భావించింది. 

ఈ నేపథ్యంలో స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా వీసా అంటే స్వేచ్ఛ కాదు.. గౌరవం అని అభివర్ణించింది. స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థులు అమెరికా చట్టాలు, రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని ఎంబసీ స్పష్టం చేసింది. ఉల్లంఘిస్తే ఉపేక్షించే ది లేదని గట్టిగా హెచ్చరించింది అమెరికా రాయబార కార్యాలయం. 

ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న వారు, చదవడానికి వెళ్లబోతున్న విదేశీ విద్యార్థులందరూ అక్కడి చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని సూచించింది. ముఖ్యంగా F-1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు తమ వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది. 

మెరికా చట్టాలను లేదా వీసా షరతులను ఉల్లంఘించినట్లయితే వీసాను తక్షణమే రద్దు చేయడం, బలవంతంగా స్వదేశానికి పంపించడం (డిపోర్టేషన్) వంటి చర్యలు తీసుకుంటామని ఎంబసీ స్పష్టం చేసింది. అంతేకాదు, భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన ఉల్లంఘనలైతే అమెరికాలోకి శాశ్వతంగా ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశమూ ఉందని తెలిపింది. 

ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనల అమలులో మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. స్టూడెంట్ వీసాలకే కాకుండా వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాల విషయంలోనూ కఠిన తనిఖీలు, నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా పని చేయడం, వీసా గడువు దాటిపోవడం, అనుమతి లేని కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలతో అనేక మంది విదేశీయులను ఇప్పటికే అమెరికా నుంచి పంపివేసిన ఘటనలు ఉన్నాయి.

భారతీయ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయులు అమెరికా వెళ్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.

చట్టాలపై అవగాహన: వెళ్లే ముందే అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
మెయింటైన్ స్టేటస్: యూనివర్సిటీ క్లాసులకు రెగ్యులర్‌గా హాజరవుతూ 'ఫుల్-టైమ్ స్టూడెంట్' స్టేటస్‌ను కాపాడుకోవాలి.

ఆన్-క్యాంపస్ జాబ్స్: అనుమతి ఉన్న పరిధిలోనే (సాధారణంగా వారానికి 20 గంటలు ఆన్-క్యాంపస్) పని చేయాలి. బయట గ్యాస్ స్టేషన్లు లేదా స్టోర్లలో క్యాష్‌కు పని చేయడం చట్టవిరుద్ధం.
సోషల్ మీడియా: సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసేటప్పుడు, గ్రూపుల్లో చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చర్చలు మీ వీసాపై ప్రభావం చూపవచ్చు.

ఒకవేళ నేను పొరపాటున చిన్న ట్రాఫిక్ రూల్ ఉల్లంఘిస్తే నా వీసా రద్దవుతుందా? 
సాధారణంగా చిన్న చిన్న ట్రాఫిక్ జరిమానాల వల్ల వీసా రద్దు కాదు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ (DUI), వేగంగా కారు నడపడం (Reckless driving) వంటివి క్రిమినల్ నేరాలుగా పరిగణించబడతాయి. ఇవి వీసా రద్దుకు కారణం కావచ్చు.

స్టూడెంట్ వీసాపై ఉండి అనుమతి లేకుండా బయట పనిచేస్తే ఏమవుతుంది? 
ఇది వీసా నిబంధనల యొక్క తీవ్రమైన ఉల్లంఘన. ఇలాంటి వారిని గుర్తించిన వెంటనే అరెస్టు చేసి, డిపోర్టేషన్ (దేశం నుంచి పంపివేయడం) చేసే అవకాశం ఉంది.

'బ్లాక్‌లిస్ట్' అంటే ఏమిటి? ఇది ఎంతకాలం ఉంటుంది? 
వీసా నిబంధనలు లేదా చట్టాలు ఉల్లంఘించిన వారిని అమెరికా ప్రభుత్వం తమ డేటాబేస్‌లో బ్లాక్ చేస్తుంది. ఉల్లంఘన తీవ్రతను బట్టి 3 ఏళ్లు, 10 ఏళ్లు లేదా జీవితకాలం పాటు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు.

ట్రంప్ ప్రభుత్వం ఎందుకు విద్యార్థులపై ఇంత కఠినంగా ఉంది? 
జాతీయ భద్రత, స్థానిక ఉద్యోగాల రక్షణ మరియు నేరాల నియంత్రణ పేరుతో ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థి వీసాలను అడ్డం పెట్టుకుని అక్రమంగా దేశంలో ఉండేవారిని ఏరివేయడం వీరి ప్రధాన లక్ష్యం.

Spotlight

Read More →