TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! iPhone price hike India: ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! MRP మారదు.. కానీ.? Bigg Boss: బిగ్ బాస్ జోడి 2 గ్రాండ్ ఫినాలే... కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్.. స్టేజ్ పైన కన్నీళ్లు! ఆ జోడీయే విన్నర్స్! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Palnadu: పల్నాడు జిల్లాలో కలకలం.. భోపాల్ ఎయిమ్స్ డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ! భార్య, కుమార్తె మృతి.! Iran War: అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ ఆ 5 షరతులు తీరాల్సిందే.! సంచలన నిర్ణయం - ఇరాన్ గట్టి పట్టు.! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! iPhone price hike India: ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! MRP మారదు.. కానీ.? Bigg Boss: బిగ్ బాస్ జోడి 2 గ్రాండ్ ఫినాలే... కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్.. స్టేజ్ పైన కన్నీళ్లు! ఆ జోడీయే విన్నర్స్! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Palnadu: పల్నాడు జిల్లాలో కలకలం.. భోపాల్ ఎయిమ్స్ డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ! భార్య, కుమార్తె మృతి.! Iran War: అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ ఆ 5 షరతులు తీరాల్సిందే.! సంచలన నిర్ణయం - ఇరాన్ గట్టి పట్టు.! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.!

Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.!

Nara Lokesh: తెలుగుజాతి కోసం జన్మించిన పార్టీ తెలుగుదేశం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ..

Published : 2026-03-29 14:10:00
  • Politics: క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మాది.. అక్రమ కేసులకు భయపడతామా?: లోకేష్ నిప్పులు..
     
  • కార్యకర్తల పిల్లలకు కత్తులు కాదు.. పుస్తకాలు ఇచ్చి గూగుల్, డెలాయిట్ ఉద్యోగాల వరకు తీసుకెళ్లాం..

Nara Lokesh: తెలుగుజాతి కోసం జన్మించిన పార్టీ తెలుగుదేశం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1982 మార్చ్ 29, మధ్యాహ్నం 2.30 దేశ, రాష్ట్ర రాజకీయ చరిత్ర మార్చిన రోజు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగుజాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగువారి గుండె చప్పుడు మన తెలుగుదేశం.

మానవత్వానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్
మానవత్వానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. చైతన్య రధం ఎక్కి ప్రజల్లోకి వెళ్లిన దమ్మున్న నాయకుడు. అప్పటి వరకూ ఏ నాయకుడూ చేయని సాహసం ఆయన చేశారు. 35 వేల కిలోమీటర్ల యాత్ర చేశారు. మా మామయ్య నందమూరి బాలకృష్ణ గారి పెళ్లి ఓవైపు, రామకృష్ణ గారి వెళ్లి ఇంకోవైపు ఉన్నా ఆయన రాలేదు. ఒక పవిత్ర బాధ్యత చేపట్టానని, విజయం సాధించిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. చేయెత్తి జై కొట్టు తెలుగోడా అని అన్న ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరిగింది. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. దేశ చరిత్రలో అదొక రికార్డ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మన రికార్డులు బద్దలు కొట్టిన వారు లేరు. రికార్డులు బద్దలు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలి అన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం.

కార్యకర్తలే టీడీపీ బలం, బలగం
కార్యకర్తలే టీడీపీ బలం, బలగం. పసుపు జెండా చూస్తేనే మనకు ఎక్కడలేని పౌరుషం. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సొంతం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు సైతం లెక్కచేయని తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థుల దాడిలో కన్నుపోయినా తగ్గేదే లేదు అన్న చెన్నుపాటి గాంధీ మనకు స్ఫూర్తి. కత్తులతో దాడి చేసినా, రక్తం కారుతున్నా ఎన్నికలు అయ్యే వరకూ పోలింగ్ బూత్ లోనే కూర్చున్న మంజులా రెడ్డి లాంటి కార్యకర్తలు మనకు ఆదర్శం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలా కాస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా.

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం అంతకాపల్లి అనే గ్రామంలో ఓ పెద్దాయన పేరు తెలుగుదేశం. పిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ అందరూ ఆయనను తెలుగుదేశం అనే పిలుస్తారు. ఆయన సొంత పేరు చాలా మందికి తెలియదు. ఆ పెద్దాయన కూడా తనను తెలుగుదేశం అని పిలిస్తేనే పలుకుతారు. ఈ విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్నాక చాలా గర్వంగా ఉండేది. నాపై బాధ్యత మరింత పెరిగింది. ఇంతటి అదృష్టం ఏ రాజకీయ పార్టీకి ఉంటుంది?

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్
దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశంలోనే మొదటి సారి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. రూ.2 లకే కిలో బియ్యం, రైతులకు రూ.50 కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది అన్న ఎన్టీఆర్. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది అన్న ఎన్టీఆర్. బీసీలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. తిరుపతి లో మొదటి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. తెలుగుగంగ ప్రాజెక్టు ఆర్కిటెక్ట్ అన్న ఎన్టీఆర్. తిరుమలలో నిత్యాన్నదానం ప్రారంభించింది అన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరోజు పడుతుంది. కేవలం ఏడేళ్లలోనే అన్న ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారు.

దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన బ్రాండ్ సీబీఎన్
దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన బ్రాండ్ సీఎం చంద్రబాబునాయుడు గారు. ప్రజల వద్దకు పాలన ప్రారంభించింది మన సీబీఎన్. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది మన సీబీఎన్. మహిళలకు కోసం దీపం పథకం ప్రారంభించింది మన సీబీఎన్. బీసీలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది మన సీబీఎన్. డ్వాక్రా పథకం ప్రారంభించింది మన సీబీఎన్. పట్టిసీమ నిర్మించింది సీబీఎన్. రైతు బజార్లు ప్రారంభించింది మన సీబీఎన్. సైబరాబాద్ కట్టిందీ ఆయనే... అమరావతి కడుతోంది ఆయనే. అప్పుడు ఐటీ - ఇప్పుడు క్వాంటం. వయస్సు 75 కానీ స్పీడ్ 25 ఏళ్ల కుర్రాడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టడు. అదీ మన సీబీఎన్.

కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాం
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పసుపు జెండా పవర్ ఏంటో చూపించాం. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలకపాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను ప్రతిపాదించింది మన సీబీఎన్. పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్ గా జీఎంసీ బాలయోగిని నియమించింది మన సీబీఎన్. అంబేద్కర్‌ గారికి భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించింది అన్న ఎన్టీఆర్. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్, ఇప్పుడు డేటా సెంటర్.. ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ.

టీడీపీని లేకుండా చేస్తామనే వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు
తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాం అని కొంత మంది అన్నారు. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా! 2019 నుంచి 2024 వరకూ అరాచక పాలన మనం చూశాం. ఐదేళ్లలో 79 మంది కార్యకర్తలను, నాయకులను చంపారు. తోట చంద్రయ్యను చంపేస్తే పాడె మోసింది మన సీబీఎన్. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకుంది మన సీబీఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ల స్వార్థం కోసం కార్యకర్తలతో కత్తి పట్టించాయి. మన సీబీఎన్ కార్యకర్తల పిల్లలకు పుస్తకాలు పట్టించారు. ఫ్యాక్షన్ దాడుల్లో కార్యకర్తలు చనిపోతే వారి పిల్లలను దత్తత తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సీబీఎన్. పాదయాత్రలో నేను ఆ పిల్లలను కలిశా. ఒకరు డెలాయిట్, మరొకరు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. కార్యకర్తలు, నేతలపై వేల కేసులు పెట్టి వేధించారు. మన దేవాలయం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. మన అధినేత ఇంటికి తాళ్లు కట్టారు. మన అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు, దాడులకు భయపడతామా? 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ 94 శాతం. 57 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమం అందిస్తున్నాం
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం మన సీబీఎన్ అందిస్తున్నారు. వృద్ధులకు రూ.4వేల పెన్షన్, వికలాంగులకు రూ.6వేలు, మంచానికి పరిమితం అయిన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్దఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. దీపం పథకం కింద  ఏటా ఉచితంగా 3 సిలిండర్లు అందిస్తున్నాం. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. ఏడాదిలో ఆయా ఖాళీలను భర్తీ చేస్తాం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తున్నాం.

బాగా పనిచేసిన కార్యకర్తలను అధినేత చంద్రబాబు పక్కన కూర్చొబెట్టాం
నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీలో కూడా అంతే పోరాడుతున్నా. సంస్కరణల కోసం మనం కలిసికట్టుగా పోరాడాలి. కష్టపడుతున్న కార్యకర్తలను మనం గుర్తించాలి. ఆ బాధ్యత నాపైనా ఉంది. కష్టపడుతున్న కార్యకర్తలను గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీపై ఉంది. ఈ రోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి పక్కన ఎవరు కూర్చున్నారో గమనించాలి. ప్రతిపక్షంలో, అధికారంలో అహర్నిశలు కష్టపడిన వారు. వారిని నేడు గుర్తించి గౌరవ అధ్యక్షులు చంద్రబాబు గారి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు కష్టపడిన విధానం మాకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అందుకే ‘మై టీడీపీ’ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను నమోదు చేయాలి. పార్టీ నేతలు అలక వీడాలి. దీనివల్ల నష్టపోయేది కార్యకర్తలు, ప్రజలు. ‘మై టీడీపీ’ యాప్ లోని సీబీఎన్ కనెక్ట్ ఆప్షన్ ద్వారా ఎవరైనా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అలక మానేయాలి, అలక అవసరం లేదని కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. అహంకారం వద్దు. అహంకారం ఉంటే ఏమవుతుందో మనం చూశాం. 151 కాస్తా 11 అయ్యాయి. కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. 

జగన్ రెడ్డి క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్నారు
ఈ మధ్య జగన్ ను చూస్తే బాధేస్తుంది. ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్నారు. అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దానిపేరు సీసీడీ. ఒక రోజు వచ్చి ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ పెట్టుబడి అంతా అబద్దం అంటారు. మొన్న మనం భూమి పూజ చేసిన తరువాత నేనే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చా అంటున్నారు. పాపం ఆయన ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

పార్టీ కేడర్ కు ఉచితంగా హెల్త్ చెకప్ చేయిస్తాం
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటి మంది కార్యకర్తలు టీడీపీకి సొంతం. గతంలో ప్రమాద బీమా కింద రూ.2లక్షలు ఇస్తే.. ఇప్పుడు ఏకంగా రూ.5 లక్షలకు పెంచారు మన సీబీఎన్. ఇప్పటి వరకూ సుమారుగా కార్యకర్తల సంక్షేమం కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసింది టీడీపీ. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో క్లస్టర్, యూనిట్, బూత్, జాతీయ, రాష్ట్ర, మండల, డివిజన్, గ్రామ కమిటీల్లో ఉన్నవారందిరకీ ఉచితంగా హెల్త్ చెకప్ చేసి, ఫాలోఅప్ కేర్ కూడా అందిస్తామని హామీ ఇస్తున్నా. ఈ రోజు ప్రవిత్రమైన రోజు. మనం ఇక్కడ కూర్చొన్నామంటే ఎంతోమంది త్యాగం వల్లే. వారందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.

అంతకుముందు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం  సీఎం చంద్రబాబు గారితో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Spotlight

Read More →