Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

2025-11-06 14:32:00

రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి  అనిత  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేటి యువతే రేపటి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువత రక్షణ, భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు” అని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్యపై ప్రభుత్వం సున్నా సహనం విధానాన్ని అవలంబించిందని ఆమె చెప్పారు. ఈగల్‌ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తగ్గించామని వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి, 50 వేల స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

“ఒక తల్లి తన కుమార్తెను రక్షించండి అని వేడుకున్న సందర్భం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఘటన తర్వాతే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలని సంకల్పించాం,” అని అనిత గారు చెప్పారు.

వైసీపీ పాలనలో డ్రగ్స్‌ దందా విస్తరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతకు చెడు అలవాట్లు దూరం చేయాలని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది, అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కే దారి తీసేవని అనిత గారు తెలిపారు. “జగన్ ఐదేళ్ల పాలనలో డ్రగ్స్‌పై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌, రైల్వే పోలీస్‌లతో సమన్వయంగా పనిచేస్తోంది” అని వివరించారు.

యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం డ్రగ్స్‌ వ్యసనాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అనిత  స్పష్టం చేశారు.

Spotlight

Read More →