America economic collapse: డాలర్ పతనం - రష్యా, చైనాల మాస్టర్ ప్లాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు.. మీపై పడే ప్రభావం ఎంత? AP Budget 2026-27: ఎల్లుండి ఏపీ బడ్జెట్ - 2026-27 ఆర్థిక ఏడాదికి బడ్జెట్..! 3 లక్షల 50 వేల కోట్లకుపైగా.. శాఖల వారీగా సమీక్ష! Medical Drone Service: గిరిజన గ్రామాలకు ఏపీ డ్రోన్ మెడికల్ సర్వీస్! 15 నిమిషాల్లో మందులు..! Vegetable Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా డౌన్! BITSPilani: అమరావతిలో బిట్స్ పిలానీ పనులు స్టార్ట్! ప్రపంచ స్థాయి విద్యకు శ్రీకారం! Kidney Stones: కిడ్నీ రాళ్లకు సహజ పరిష్కారం... రోజుకు ఎంత నీరు తాగాలి? Coconut Chutney: ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసి చూడండి…! భోజనం రుచి రెట్టింపుగా..! Job Mela: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్! జాబ్ మేళా.. పది పాసైతే చాలు! RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్స్! కస్టమర్లకు భారీ శుభవార్త.. ఈ బ్యాంకుల రూపురేఖలు మారబోతున్నాయి! US Pakistan Relations: పాకిస్తాన్ దుస్థితి.. అమెరికా చేతిలో ‘టాయిలెట్ పేపర్’లా మారిపోయిందా? రక్షణ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు నిజం! America economic collapse: డాలర్ పతనం - రష్యా, చైనాల మాస్టర్ ప్లాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు.. మీపై పడే ప్రభావం ఎంత? AP Budget 2026-27: ఎల్లుండి ఏపీ బడ్జెట్ - 2026-27 ఆర్థిక ఏడాదికి బడ్జెట్..! 3 లక్షల 50 వేల కోట్లకుపైగా.. శాఖల వారీగా సమీక్ష! Medical Drone Service: గిరిజన గ్రామాలకు ఏపీ డ్రోన్ మెడికల్ సర్వీస్! 15 నిమిషాల్లో మందులు..! Vegetable Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా డౌన్! BITSPilani: అమరావతిలో బిట్స్ పిలానీ పనులు స్టార్ట్! ప్రపంచ స్థాయి విద్యకు శ్రీకారం! Kidney Stones: కిడ్నీ రాళ్లకు సహజ పరిష్కారం... రోజుకు ఎంత నీరు తాగాలి? Coconut Chutney: ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసి చూడండి…! భోజనం రుచి రెట్టింపుగా..! Job Mela: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్! జాబ్ మేళా.. పది పాసైతే చాలు! RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్స్! కస్టమర్లకు భారీ శుభవార్త.. ఈ బ్యాంకుల రూపురేఖలు మారబోతున్నాయి! US Pakistan Relations: పాకిస్తాన్ దుస్థితి.. అమెరికా చేతిలో ‘టాయిలెట్ పేపర్’లా మారిపోయిందా? రక్షణ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు నిజం!

AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్.. అధికారుల అండ లేనిదే ఇంత పెద్ద కుంభకోణమా? సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు!

AP Liquor Scam Raj KC Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కేసీరెడ్డిని ఈ మొత్తం వ్యవహారానికి 'ఆర్కిటెక్ట్'గా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరగదని, కేసీరెడ్డి మరికొంత కాలం జైలులోనే ఉండాలని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది..

Published : 2026-02-12 16:09:00
  • స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ ఆయనే! 
     
  • సలహాదారు ముసుగులో భారీ కుట్ర?
     
  • నిరాశపరిచిన బెయిల్ పిటిషన్..

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన భారీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి  రాజ్ కేసీరెడ్డేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ స్కామ్ వెనుక ఉన్న లోతుపాతులను పరిశీలిస్తే, అధికార యంత్రాంగం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడం అసాధ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసీరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ సలహాదారుల ముసుగులో జరిగిన అక్రమాలను తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ కుంభకోణం పరిధి చాలా పెద్దదని, వ్యవస్థలోని లోపాలను వాడుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ అధికారుల అండదండలు లేనిదే ఇలాంటి భారీ స్కామ్‌లు రూపుదిద్దుకోవు. పదవిలో ఉన్న కీలక వ్యక్తుల మద్దతు ఉండబట్టే అధికారులు బరితెగించారు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కుమ్మక్కయిన అధికారులను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

నిందితులకు సహకరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన సీజేఐ విచారణ సందర్భంగా రాజ్ కేసీరెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ.. కేసీరెడ్డి కేవలం ప్రభుత్వానికి సలహాదారు మాత్రమేనని పాలనాపరమైన నిర్ణయాల్లో ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వాదనను సీజేఐ ధర్మాసనం  తోసిపుచ్చింది. ఆయన కేవలం సలహాదారు కాదు.. ఈ మొత్తం స్కామ్‌కు మాస్టర్ మైండ్  అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది.

కోర్టు ధోరణి కఠినంగా ఉండటం, బెయిల్ పిటిషన్‌ను  కొట్టివేయడం చేసేందుకు ధర్మాసనం సిద్ధమవ్వడంతో రాజ్ కేసీరెడ్డి తరపు న్యాయవాది అప్రమత్తమయ్యారు. పిటిషన్ కొట్టివేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో, తాము పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అనుమతించడంతో కేసీరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైనట్లయింది. ఈ తీర్పుతో ఏపీ మద్యం కుంభకోణం కేసులో తదుపరి విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Spotlight

Read More →