H1B Visa: అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. ఎనిమిదేళ్లుగా ఇంటికి దూరం! హెచ్-1బీ తెచ్చిన తంట... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా.. కారణం అదే! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Scientist Jobs: నెలకు రూ.2 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! H1B Visa: అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. ఎనిమిదేళ్లుగా ఇంటికి దూరం! హెచ్-1బీ తెచ్చిన తంట... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా.. కారణం అదే! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Scientist Jobs: నెలకు రూ.2 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!

Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల కోసం కఠినమైన నిబంధనలతో (Strict Rules) పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిసిటివి కెమెరాల నిఘా మరియు పటిష్టమైన భద్రత నడుమ ఈ పరీక్షలు జరగనున్నాయి.

Published : 2026-02-22 13:20:00

హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం…

144 సెక్షన్ మధ్య ఇంటర్ వార్షిక పరీక్షలు…

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పూర్తిగా నిషేధం..!

Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు సిద్ధం చేసి, అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

మాల్‌ప్రాక్టీస్‌ నివారణ కోసం ప్రతి గదిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

విద్యార్థుల రాకపోకలకు సౌకర్యంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.

పరీక్షా నిర్వహణలో భాగంగా ఇన్విజిలేటర్లకు కూడా కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రశ్నపత్రాల రవాణా నుంచి జవాబు పత్రాల సేకరణ వరకు భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

Spotlight

Read More →