Minister Comments On YCP: అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన వైసీపీ నీతులు చెప్పడం సిగ్గుచేటు - మంత్రి!

Minister Comments On YCP: గత వైసీపీ ప్రభుత్వం విద్యార్దులకు పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేదనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Published : 2026-02-13 20:47:00
  • వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించిన ఘనత చంద్రబాబు నాయుడుదే.!
     
  • రూ. 162.37 కోట్లు,  2018-19 నాటికి రూ. 1844.55 బకాయిలు..

Minister Comments On YCP: గత వైసీపీ ప్రభుత్వం విద్యార్దులకు పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేదనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు మండలిలో సభ్యులు అడిన ప్రశ్నకు మంత్రి  సమాధానమిచ్చారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...2019 జూన్ నాటికి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించింది.  

207-18 సంవత్సరానికి  రూ. 162.37 కోట్లు,  2018-19 నాటికి రూ. 1844.55 బకాయిలు మెత్తం కలిపి రూ. 2 వేల 6.92 కోట్లు కూటమి ప్రభుత్వం దశల వారీగా  చెల్లిచింది. రూ.1859 కోట్లు జూన్ 2024 నుంచి విద్యార్థుల కాలేజీ అకౌంట్స్ లో జమచేయడం జరిగింది. 2024 - 25 ఏడాదికి 10.02.2026 న రూ. 12 కోట్లు విడుదల చేసి  సీఎం.ఎం.ఎఫ్ ఎస్ లో అప్ లోడ్ చేయడం జరిగింది.  

2025 - 26 ఏడాదికి సంబంధించి ఎస్సి, ఎస్టీలకు పెండింగ్ బకాయిలు రూ.300 కోట్లు విడుదల చేశాం. మిగతా అన్ని వర్గాలకు మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. మద్యలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ  అన్న మాటకు మంత్రి బదులిస్తూ అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన వైసీపీ నేతలు నీతులు చెప్పటం సిగ్గుచేటు అంటూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.

Spotlight

Read More →