గత కొంతకాలంగా సినీ నటుడు ధర్మ మహేష్, అతని భార్య గౌతమి మధ్య జరుగుతున్న గొడవలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ధర్మ మహేష్‌తో తన వైవాహిక జీవితం, అలాగే అతడి ప్రవర్తనపై గౌతమి చేసిన ఆరోపణలు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాయి.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన గౌతమి, తన భర్తతోపాటు పలువురు సినీ సెలబ్రెటీలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీతూ చౌదరిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
గౌతమి ఏమంటోంది?
గౌతమి ఆరోపణల ప్రకారం, తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త ధర్మ మహేష్ రీతూ చౌదరితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. ఆమె కారణంగానే తనతో గొడవలు పెట్టుకున్నాడని, తనను దూరం పెట్టాడని ఆరోపించింది. రీతూ గురించి అడిగినందుకు తనను వేధిస్తున్నాడంటూ ఆమె పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్స్ను కూడా గౌతమి షేర్ చేసింది.
అంతేకాకుండా, గతంలో తాను, తన భర్త కలిసి నివసించిన అపార్ట్‌మెంట్‌కు రీతూ చౌదరి తరచుగా వస్తూ ఉండేదని, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాత్రి సమయంలో, అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె తన భర్త దగ్గరకు వచ్చి, తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెళ్ళిపోయేదని గౌతమి ఆరోపించింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీతూ చౌదరితో పాటు, బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీతపై కూడా గౌతమి ఆరోపణలు చేసింది. తన రెస్టారెంట్ "16 బ్రాండ్" ప్రారంభానికి ఒక క్రికెటర్‌ను ఆహ్వానించాలని తాను ప్లాన్ చేసుకున్నప్పుడు, కిరాక్ సీత తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిందని గౌతమి చెప్పింది. "నువ్వు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో నేను చూస్తా.. నాకు పెద్ద పెద్ద క్రికెటర్స్ తెలుసు.. నేను ఇన్వైట్ చేస్తా" అంటూ సీత బెదిరించినట్లు గౌతమి ఆరోపించింది.
"అసలు నా రెస్టారెంట్ గురించి ఆమెకెందుకు? ఆ విషయాల్లో ఆమె ప్రమేయం ఏంటి? ఆమె వెనుక నా భర్త ఉన్నాడని నాకు అర్థమైంది" అని గౌతమి చెప్పుకొచ్చింది. తమ ఇంటికి కూడా వచ్చిందని, తన భర్తకు సీతకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలియదని గౌతమి పేర్కొంది.
గతంలో కూడా గౌతమి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, పలు ఇంటర్వ్యూల్లోనూ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నాడని, తనను పెళ్లి చేసుకున్న తర్వాత నరకం చూపించాడని ఆమె ఆరోపించింది. ఈసారి ఏకంగా పేర్లు చెప్పి ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వివాదంపై ధర్మ మహేష్, రీతూ చౌదరి, కిరాక్ సీత ఎలా స్పందిస్తారో చూడాలి.