మన వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండే ఆవనూనె ఇప్పుడు కేవలం వంటకాలకు రుచి ఇచ్చే నూనె మాత్రమే కాక, ఆరోగ్యం మరియు సౌందర్యానికి దారితీసే ఒక సంపదగా మారింది. పాత కాలంలో ఆవనూనె లేకుండా వంటగది ఊహించడానికి కూడా కష్టం. దాని ఘాటు రుచి, సుగంధం వంటకాలకు ప్రత్యేకత ఇస్తూ, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలకే ఆవనూనె ఒక సహజమైన ఇంటివైద్యం. కొద్దిగా వేడి చేసి ఛాతీపై రుద్దడం లేదా ఆవిరి పట్టడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదం నిపుణులు తెలుపుతున్నారు.
ఆవనూనె ప్రయోజనాలు వంటకాల్లోనే పరిమితం కావడం లేదు. ఇది చర్మం, జుట్టుకు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. రోజువారీగా ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా అదేవిధంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదనంగా, మృత కణాలను తొలగించి, చర్మానికి సొగసైన రూపాన్ని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యతో యువత చాలా ఆందోళనలు చెందుతున్నారు అయితే జుట్టు విషయంలో కూడా ఆవనూనె ప్రయోజనాలు అనేకం. వేడి చేసి తలకి మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి.
కేవలం అందానికి కేసాలకు మాత్రమే కాదు, శరీర నొప్పుల విషయంలో కూడా ఆవనూనె ప్రత్యేక ప్రయోజనం అందిస్తుంది. కండరాల బిగుసుకుపోవడం, నొప్పులు అనుభవించే వృద్ధుల కు ఆవనూనె ఒక దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. గోరువెచ్చగా వేడిచేసి ఆవనూనెతో మసాజ్ చేయించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. రక్త ప్రసరణ పెరుగడం వల్ల కండరాల లోతైన నొప్పులు కూడా తగ్గుతాయి. ఇది సంప్రదాయ వైద్యంలో ఒక అద్భుతమైన పరిష్కారం.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీరు ముందుగా మీ వైద్య నిపుణుల సంప్రదించు ఉపయోగించుకోవడం మంచిది.